పుట:2015.373190.Athma-Charitramu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము

త్ర్యము, శైలిసౌకుమార్యమును నా మనస్సున కమితానందము గొలిపెను. నా సహపాఠులగు బాలకులు నన్ను దమయిండ్లకుఁ గొనిపోయి, నాకు 'పెప్పరుమింటు'బిళ్లలు నూడిద లిడుచుండువారు. ఈ నూతనోపహారవస్తువులలోఁగూడ నా బుద్ధికి విపరీతభేదములు పరికల్పితములయ్యెను. గాటుగానుండు తెల్లని బిళ్లలకంటె, చక్కెఱపా లధికమై కంటి కింపగు నెఱ్ఱనిరూపమునను, ఇంచుక గులాబితావితోను నొప్పారెడి రంగుబిళ్ల లే నాకు రుచ్యములుగ నుండెను !

అది వేసవికాల మగుటచేత, అచట మామిడిపండ్లు ముమ్మరముగ నుండెను. ఉద్యోగవ్యాజమున మా తండ్రికిఁ గానుకలుగ సమర్పింపఁబడిన ఫలాదు లన్నియు నొకచీఁకటిగదిలోఁ జేర్పఁబడుచుండెను. గదితలుపు తీయునప్పటికి, పండ్ల నెత్తావులమొత్తము నాసికను మొత్తుచుండెడిది. రాత్రి భోజనానంతరమున మా తండ్రికోరిక చొప్పున పొరుగుబ్రాహ్మణుఁ డొకడు పనసపండ్లు కోసి తినలు విడఁదీయుచుండును. మా తలిదండ్రు లవి యచట నుండువారికిఁ బంచిపెట్టుచుందురు. మా మాతామహునకుఁ బుత్రవత్సలతయు మధురఫలాపేక్షయు మిక్కుటము. మమ్ముఁ జూచిపో వచ్చినయాయన, ఇరువురు మనుమలమీఁది ప్రేమమాధుర్యమునకును, మిగుల మాగినపండ్ల తియ్యదనమునకును జొక్కి, యా వేసవి మా చెంతనే గడపివై చెను !

ఈతకోటలో నా యనుభవమున ముఖ్యముగ రెండుసంగతులు కన్పట్టెను. అచట నొకగృహస్థునికి భార్యయు పుత్రుఁడును గలరు. తండ్రి మిగుల పొడుగుగను, తల్లియు తనయుఁడును కడు కుఱుచగను నుండుట నా కెంతో చోద్యముగ నుండెను. మా తల్లి కీసంగతి పలుమా రాశ్చర్యమునఁ జెప్పుచుండువాఁడను. మా పొరుగున నొకబీదవాని కుటీరము గలదు. ఆతని కొక కుంటికూఁతురు తప్ప మఱి యెవ్వ