పుట:2015.373190.Athma-Charitramu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. గోపాలపురము 5

నా కీరంగుభేదములను గూర్చి కల విపరీతపుఁబట్టుదల, చదువు పుస్తకములు మొదలు వేసికొను వలువలు, ఆడుకొను వస్తువుల వఱకును, బాల్యమున వ్యాపించియుండెను ! ఎఱ్ఱనిచేలములు నాకుఁ బ్రియములు, శోణకుసుమము లత్యంతమనోహరములు. రంగులందువలెనే, రుచులందును నాకు గట్టిపట్టుదల యుండెను. కమ్మనికూరలు తియ్యనిఫలములు నాకు రుచ్యములు. పులుపు ఆగర్భశత్రువు. కారము మధ్యస్థము.

2. గోపాలపురము

వెనుకటి ప్రకరణమునందలి సంగతులు, ఐదారేండ్ల వయసునను, అంతకుఁ బూర్వమందును సభవించి నాకు జ్ఞప్తి నున్న ప్రత్యేకానుభవములు. సూత్రమునఁ గట్టిన పుస్తకమురీతిని, జలపూరితమగు నదీప్రవాహముఁబోలెను, నా కింకను జీవితము స్థాయిభావము నొందిన యనుభవసముదాయము గాకుండెను.

మా తండ్రి సర్వేశాఖలో మరల నుద్యోగము సంపాదించి, ఈమాఱు అమలాపురము తాలూకా గ్రామములలో నివసించెను. అందలి చిన్న గ్రామములలో 'ఈతకోట' యొకటి. ఈమధ్య నే నచటికిఁ బోయి చూడఁగా, అది వట్టి కుగ్రామముగఁ గ్రుంగిపోవుటకును, చిన్ననాఁటి నా యాటపట్టు లన్నియు స్వల్పప్రదేశములుగ సంకుచితము లగుటకును, విస్మయవిషాదముల నొందితిని ! నా యాఱవయేట, గొన్ని నెలలు మే మచట నుంటిమి. అప్పటికి నా తమ్ముఁడు వెంకటరామయ్య రెండుసంవత్సరములవాఁడు. మా యింటిముందలి చావడిలోనే గ్రామపాఠశాల యుండెను. అందు చేరి నేను రెండవపాఠ పుస్తకము చదువుచుంటిని. ఆ పాఠములందలి ప్రకృతివర్ణనావైచి