పుట:2015.373190.Athma-Charitramu.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 394

భార్యయనునది భర్తవినోదార్థ మేర్పడిన కందుక విశేష మనియె భావించుచున్నారు గాని, ఆమెయును బురుషునివలెనే స్వబుద్ధి వినియోగించి, స్వతంత్రత నూని, ధైర్యసాహసాదులు గలిగి, ఘనకార్యములు నిర్వర్తించి, కృతకృత్య కావలెనని యెవరు నంతగఁ దలంచు చుండుట లేదు ! ఈ సుగుణములు దాల్చి, మగనిపరిచారికవలె మాత్రమె చరింపక, చెల్లింపవలసిన యధికారము చెల్లింపుచు, చేయవలసిన ఘనకార్యములు చేయుచు, తన ప్రజ్ఞాచాతుర్యములు మెఱయు నట్టుగ మెలంగినది పూర్వకాలస్త్రీలలో సత్యభామ యొక తెయే ! పత్నీధర్మ మెప్పటికిని పతి ననుసరించుటయే యని తలంచెడి మన దేశమున, ప్రజ్ఞయు, స్వతంత్ర బుద్ధియుఁ గలిగి సంచరించెడి సత్యభామవంటి చానలు జాణలని ప్రతీతి గలుగుటయం దేమియాశ్చర్యము ?

"ఈ గ్రంథమునఁ జేర్పఁబడిన యింకొకకథనుగూర్చి కూడ కొంత చెప్పవలయును. మొదటినుండియు సత్ప్రవర్తనగల స్త్రీయే సుగుణవతి గాని, ఒకప్పుడు ప్రమాదవశమున తప్పు చేసి పిదప పరితపించి సన్మార్గముఁ జొచ్చిన వనిత మంచిదికాదని మనదేశమునఁ బలువుర తలంపు. ఇది సరికాదు. ఇందలి 'కాంచనమాలిని' మొదట నాటవెలఁదియె యైనను, పిమ్మట గాఢానుతాపమున సన్మార్గ మవలంబించెను. ఇట్టి మానినులును మన మన్ననలకుఁ బాత్రలే."

మద్రాసునందలి "సంఘసంస్కారిణీ" పత్రిక నాపుస్తకమును విమర్శించుచు నిట్లు వ్రాసెను : - "ఈ గ్రంథకర్త తెలుఁగు జనానా పత్రికను బ్రచురించియు, సద్గ్రంథములు ప్రకటించియు, ప్రస్తుత పరిస్థితుల వైపరీత్యమున నజ్ఞాన తిమిరమున మునింగిన స్త్రీజాతి నుద్ధరింపఁ బ్రయత్నించుచున్నాఁడు. ఇట్టి పుస్తకములు మూలమున