పుట:2015.373190.Athma-Charitramu.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42. "హిందూ సుందరీమణులు" 395

స్త్రీలకు ప్రమోదముఁ గలిగింప వీరియుద్యమము. ఎక్కువగఁ బరిశ్రమించి, పురాణములందుండిన యుత్తమస్త్రీల చరిత్రములు వీరు తెలుఁగున రచించి ప్రకటించిరి. ప్రాచీనప్రకృతభామినుల సుగుణములతో విలసిల్లు సత్యభామకు స్వానుభవసాహాయ్యమున ద్రౌపది చేసిన యమూల్యోపదేశములు, ఈకాలపుఁ బుణ్యాంగన లనుసరింప యోగ్యముగ నున్నవి. ధనాశచేఁ దన మానము నమ్ముకొని తుద కదృష్టవశమున పరితాపము నొంది నూతనజీవమున విరాజిల్లెడి కాంచనమాలినికథవలన, ఎంత దుస్థితికి వచ్చినయింతియైన నధైర్యపడక పూనికతోఁ శీలసౌష్ఠవముఁ బడసినచో బూజనీయ యగు ననుట స్పష్టము. * * * "

జనానాపత్రిక కొంతకాలమునుండి ముప్పదిరెండు పుటలు గల పుస్తకరూపము దాల్చెను. కావున నెలనెలయును సామాన్య వ్యాసములేకాక, యేదో యొకపుస్తకభాగముకూడ నందుఁ బ్రచురింపవలసి వచ్చెను. కొంతకాలముక్రిందట హిందూపత్రిక కొక యాంగ్లస్త్రీ "ఇంగ్లీషువారి సంసారపద్ధతు" లను గుఱించి వ్రాసిన వినోదకరములగు వ్యాసములు నేను, జదివియుంటిని. ఇపు డొకవిద్యార్థి చేతిలో నీ వ్యాసము లన్నియుఁ గూర్చిన పుస్తక మొకటి చూచితిని. గ్రంథకర్త్రి మైసూరు స్త్రీవిద్యాలయ ప్రథమోపాధ్యాయిని యగు రిడ్సుడేలుకన్యక యని నా కపుడు తెలిసెను. ఈపుస్తకము నాంధ్రీకరించి 'జనానాపత్రిక' లోఁ బ్రచురింప ననుజ్ఞ నీయుఁడని యామెకు 17 వ సెప్టెంబరున వ్రాయఁగా, అందుల కామె యిష్టపడెను.

19 వ సెప్టెంబరు దినచర్యయం దిట్లు గలదు : - "పాప హేయఁపుఁ దలంపులు నన్ను సదా వేధించుచున్నవె ! చెన్నరాజ