పుట:2015.373190.Athma-Charitramu.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 390

వెడలి పోయిరి ! 8 వ జూలయితేదీని వీరేశలింగముగారు వచ్చి మాయింట విడిసిరి. ఆరోజు ఆదివార మగుటచేత, పఠనాలయములో "ప్రవర్తనము" అను విషయమునుగుఱించి వారు ఉపన్యసించిరి.

12 వ జూలయిని కామశాస్త్రిగారు జబ్బుగా నుండుటచే వారినిఁ జూడఁబోయితిని. "మహిమ్న" స్తోత్రములోని శ్లోకము లాయన చదివి యర్థము చెప్పిరి. బ్రాహ్మమతమందలి యేకేశ్వర ప్రార్థనము నివి పోలియుండెను.

20 వ జూలయి తేదీని "విద్యార్థుల సాహితీసంఘ" సభకు నే నగ్రాసనాధిపతి నైతిని. నాటకవృత్తి గైకొనిన యువకుల దుర్నీతులనుగుఱించి ప్రస్తావవశమున నేను మాటాడితిని. ఈ ప్రాంతములు చూచిపోవుట కేతెంచిన ధన్వాడ అనంతముగా రా సభకు వచ్చి, నా యభిప్రాయములలో సత్యము గల దని నొక్కి చెప్పిరి. పిమ్మట నేను జాలసేపు వారితోఁ బ్రసంగించితిని. ఆరాత్రియే వారు మద్రాసు వెడలిపోయిరి.

1 వ జూలయి నేను బుట్టినరోజు. నాఁటి దినచర్యయం దిటు లుండెను : - "ఈరోజుతో నావయస్సు ముప్పదిసంవత్సరములు. ఇంతకాలము నా కాయురారోగ్యముల నొసంగినందుకు, దైవమా, నీకు వందనములు ! మనుజులు చెప్పు గొప్పసంగతులయొక్కయు చేయు ఘనకార్యములయుమాట యటుంచి, జీవించుటయే యొక విశేషముగదా ! మనుష్యుఁడు తృణప్రాయుఁడు గాఁడు. నే ననుభవమునఁ గాంచిన మహావిషయముల కెల్ల దేవునికిఁ గృతజ్ఞుఁడను. నామనస్సు కొన్ని సుసంకల్పములకును, పెక్కు చెడుతలంపులకును దావలము. నాకు జీవితము తెంపులేని సముద్రమువలెఁ గానవచ్చుచు