పుట:2015.373190.Athma-Charitramu.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41. క్రొత్త హరికథలు 389

అని నా కభయహస్త మిచ్చినటు లాయన సెలవిచ్చిరి ! ఈశ్వరసేవకుల మని చెప్పుకొనువారివైఖరి యిట్టిది. ఈ పాఠశాలలో లెక్కలే నన్ని లోపములు కష్టములు నున్నవి ! దీని కీయన యజమాని. ఇట్లయ్యును, పాఠశాలలోఁగల చిన్నలోపములను గుఱించియైన నడుగుట కీమహనీయునికిఁ దోఁచదు, తీఱదు ! దైవమా యేమని చెప్పను !"

41. క్రొత్త హరికథలు

ఇదివఱకు నేను "హిందూసుందరీమణు" లను పేరుతో సీత సావిత్రి మున్నగు నేడుగురు సుదతుల కథలు వ్రాసితిని. ఇంకను ప్రాచీనకాలసుందరు లనేకులు కలరు. కొలఁదిదినములక్రిందట నేను రాజమంద్రిలో నుండునపుడు వెంకటరత్నముపంతులుగారు అరుంధతి మున్నగు స్త్రీలనుగుఱించి నాకుఁ జెప్పిరి. నామిత్రు కామశాస్త్రిగారిటీవల "కాదంబరీసారసంగ్రహము"ను రచియించి, అందలి మహాశ్వేతనుగుఱించి సూచించిరి. కావున నేను "జనానాపత్రిక" లో "హిందూసుందరీమణుల" రెండవభాగమును వ్రాయ నారంభించితిని.

ఆకాలమున బెజవాడలో కొంచెముసేపు రెయిళ్లు ఆఁగుచు వచ్చుటచేత, తమకుఁ గొంచెము అన్నము పంపు మని స్నేహితులు తఱచుగ నాకు వ్రాయుచు వచ్చిరి. 3 వ జూలయిని వీరేశలింగముగారు వచ్చుచుంటినని వ్రాసిరి. కాని, యానాఁడు బండి యాలస్యముగ వచ్చుటచేత నేను పాఠశాలకు వెళ్లి పోయితిని. స్నేహితులు వారిని గలసికొనిరి. మఱునాఁడు ప్రణతార్తిహర అయ్యరుగారు మద్రాసు నుండి రాజమంద్రి వైపునకుఁ బోవుచు, ఐదుగురికి అన్నము పంపుఁడని నాకు వ్రాయఁగా, ఒక బ్రాహ్మణవిద్యార్థిచే నన్నము పంపితిని. కాని యతఁ డాలస్యముగ వెళ్లుటచేత, వారు నిరాహారులై