పుట:2015.373190.Athma-Charitramu.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41. క్రొత్త హరికథలు 391

న్నది ! దేవుఁడు న న్నాశీర్వదించి, నా కెక్కువ పవిత్రత యొసంగి, నేను సార్థకజీవితమును గడపునట్లనుగ్రహించునుగాక!"

ఈసంవత్సరము జూలయినుండియు "జనానాపత్రిక"ను వీరభద్రరావుగారి విద్యాసాగరముద్రాలయమునుండి తీసివైచి, మద్రాసు బ్రాహ్మ సమాజమువారి కార్యాలయమున నచ్చొత్తించుచువచ్చితిని. దీనికిఁ గారణము, రావుగారి ముద్రాలయము సరిగా పని చేయకపోవుటయే. ఆయన వ్యవహారపుఁజిక్కులలోఁ బడి, ముద్రాలయమును సరిగా నడుపనేరకుండెను.

జనానాపత్రికనుగూర్చిన పనులన్నియు సొంతముగ నేను జేయుచుండువాఁడను. నాభార్యయు, కొందఱు విద్యార్థులును పత్రికను చందాదారులకుఁ బంపు విషయమున సాయము చేయుచు వచ్చిరి. చాలినంతసొమ్ము పత్రికకు లేకుండుటచేత నిట్టిపనులు కొక పరిచారకును నియమింపలేకుంటిని.

ఆగష్టునెలలో మూఁడుదినములు సెలవగుటచేత, సకుటుంబముగ నేను ఏలూరు పోయితిని. కొన్నిరోజుల వఱకును నాభార్య మాత్రము తిరిగి రా లేదు. అందువలన బెజవాడలోని నేనే వంట చేసికొనుచుండు వాఁడను. ఇంట రెండవభాగమున నొంటరిగ నుండు వీరభద్రరావుగారికిని స్వహస్తపాకమే ! ఆనెల 23 వ తేదీని నేను మధ్యాహ్నమున బడికిఁ బోవుచు, దారిలో బందరు కాలువలోఁ బడిపోయిన స్త్రీ నొకతెను గట్టున కీడ్చుచుండు కొందఱిని జూచితిని. ఆత్మహత్య చేయవల దని వారించి యా మెను మాయింటికిఁ గొనివచ్చి భోజన మిడితిని. గృహకల్లోలములవలన తాను ప్రాణహత్యకుఁ గడంగితినని యాస్త్రీ చెప్పెను. ఆస్త్రీ చీర నీటఁ దడియుటచేత