పుట:2015.373190.Athma-Charitramu.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 382

నెపోలియను, కనుల మిఱుమిట్లు గొలిపెడి కవితానై పుణ్యము గల షేక్స్‌పియరును గాకపోవచ్చును ! ఇతఁడు మన తోడియాంధ్రుఁడు. షేక్స్‌పియరురునకుఁగల కవితాశక్తియు, క్రాంవెలునకుఁ గల బాహుబలమును, ఈతనికిఁ గలదని చెప్పువాఁడను కాను. కాని, సంస్కరణ విషయమున వీరియందువలెనే యీయనయందును శౌర్యగుణము ప్రస్ఫుట మయ్యెను. శూరునికి సద్భావము ప్రథమలక్షణము. వీరేశలింగము పంతులను సద్భావమున మించువా రుండుట యరుదు. ఆచార కాలసర్పము కోఱలు పెఱికి, మఠాధిపతుల తీవ్రాస్త్రములను వమ్ముచేసి, సంఘమువారి శాపముల విఫలమువేసి, మన హాస్యములను క్రౌర్యములను సహనబుద్ధితో క్షమించిన యీధీరుని పేరు, లూధరు, తియొడోరు పార్కరు, రామమోహనరాయలు మున్నగు యోధుల నామముల ప్రక్క కనకాక్షరములతో లిఖియింపఁదగినదియెకదా ! ధైర్యమునందు, బుద్ధిస్వాతంత్ర్యమునందు, క్షితిని జయింపఁజాలిన క్షమా గుణమునందును, దక్షిణహిందూదేశమున నీతనితో సరిసమాను లెవ్వరు? ఉత్ప్రేక్షాతిశయోక్తులతోఁ బ్రొద్దుపుచ్చ నాయుద్యమము కాదు. కేవల సత్యమునుగూర్చిన నా నిశ్చితాభిప్రాయమె నేను వక్కాణించుచున్నాను. ఈనాయకుఁడు అసమానప్రజ్ఞయు, స్వతంత్రబుద్ధియు, సమధిక వాక్ఛక్తులతో వెలయుచున్నాఁడని చెప్పువాఁడను గాను. ఆయనకుఁగల లోపములు నాకంటె నెవరికిని బాగుగఁ దెలియవని చెప్పఁగలను. ఐనను, నిశ్చితబుద్ధి, స్వార్థత్యాగము, నయసంపద - వీనియందు మాత్రము ఉన్నతస్థానమునకును, అగ్రస్థానమునకును, నానాయకుఁ డర్హుఁడని నమ్మువాఁడను.

సంఘసంస్కరణము తీక్ష్ణత దాల్చియుండెడి యాపూర్వదినములలో వీరేశలింగ సంస్కర్తకు చెడుగనిన బొత్తిగ నోరిమి లేకుండె