పుట:2015.373190.Athma-Charitramu.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39. "వీరసంస్కర్త" 383

డిది. యుద్ధరంగమున మృదువగు సాధనములు ప్రయోగింప నాయన కిచ్చలేదు. దౌష్ట్యము నొక్క పెట్టున దుడ్డుఁగఱ్ఱతో మోదుటకె యాతఁ డభ్యాసపడియుండెను. ఆయన ప్రహసనములు వ్యక్తిగతములని యందఱు నెఱుఁగుదురు. ఆప్రహసనములందలి ముఖ్యపాత్రలు సజీవులగు మనుజులె. రాజమహేంద్రనగరవీథులలో రాత్రులు పడుపు టిండ్లకుఁ జేరెడి విటకాండ్రును, న్యాయసభలలో నున్నతాసనము లధిష్ఠించు నీతిదూరులగు నుద్యోగస్థులును - వీరందఱును తన ప్రహసనములకై ప్రత్యేకముగఁ గల్పింపఁబడిన పాత్రలనియె కాక, నీతిపథమునకు న్యాయమార్గమునకును ముఖ్యముగఁ దనకును ఆగర్భ శత్రువులనియె యాయన దలంచువాఁడు ! వారియెడ నాయన గాంచిన గాఢమైన, హృదయ పూర్వకమయిన, క్రోధమునకుఁగల రహస్య మిదియె !

తనప్రక్క టుపాకి వ్రేలాడుచుండ, ఒఱనుండి తీసిన కత్తిని ఝళిపించుచు యుద్ధసన్నద్ధుఁ డగు వీరభటునివలె వివేకవర్థనీ పత్రిక యాదినములలో వారమువారమును నీతిన్యాయముల నుల్లంఘించు వారలతోఁ బోరుసల్పుచుండెడిది. అందలి యుపన్యాసముల కెట్లు దౌష్ట్యద్రోహములు వడంకుచుండెనో యిప్పటికిని గొంద ఱెఱుంగుదురు. ఆయన ప్రహసనము కటువుగ నుండునట్లె, వారివ్యాసము గాంబీర్యము వహించి యుండెను.

వీరేశలింగముపంతులపేరు సంఘసంస్కరణ విషయములందు వలెనే సాహిత్యపునరుద్ధరణమునందును విఖ్యాతి గాంచెను. ఈరచయిత ప్రకృతాంధ్రవచన చతురాననుఁడు.

సంస్కృత సారస్వత సాంగత్యమున నాంధ్రకవిత్వము పూర్వము వినుతికెక్కినరీతిని, ఆంగ్లసాహిత్యసంపర్కమున ప్రకృతమున నాంధ్రవచనము సుస్థితికి వచ్చెను. ఈకార్యము వీరేశలింగకవి