పుట:2015.373190.Athma-Charitramu.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39. "వీరసంస్కర్త" 381

దృఢత్వస్థిరత్వము లేర్పడవనినమ్మి, యాయన 1881 వ సంవత్సరము 11 వ డిసెంబరున రాజమహేంద్రవరమున ప్రథమతితంతువివాహము జరిగించిరి.

వాక్కునకులేని చైతన్యవిశేషము కార్యమునకుఁ గలదు. మాటలకు లొంగక నిదురించెడి సంఘము పనుల కదఱిపడి లేచి, ఆలోచనచేయఁదొడంగెను. అంత, వితంతూద్వాహసంస్కరణము నణఁచి వేయ సంఘములోని పూర్వాచారపరులు విశ్వప్రయత్నములు చేసిరి. పంతులను పంతుల మిత్రులను వారు బహిష్కరించిరి. వీరేశలింగముగారి యనుచరు లంత నొక్కరె బహిష్కారభీతిచే నొత్తిగిల్లినను, ఆయనమాత్రము గొంకకుండెను. 1888 వ సంవత్సరమునఁ దన ప్రియమిత్రుఁడు గవర్రాజుగారు మృతినొందినను, వీరేశలింగము పంతులుగారు ధైర్య స్థైర్యములు వీడకుండిరి. తా నొకఁడె రణరంగమున నిలువవలసివచ్చినను, వీరేశలింగముపంతు లించుకయైనను జలింపని ధీరత్వమునఁ బోరు సల్పెను. కావుననె యా మహాశయునికిని, ఆయన చేపట్టిన యుద్యమమునకును సంపూర్ణ విజయము చేకూరెను. కాకినాడ వాస్తవ్యులు పైండా రామకృష్ణయ్యగారు వితంతూద్వాహములకు వలసిన ధనసాహాయ్యముచేసిరి. బహిరంగమున పంతులుగారితో భోజనముచేయ సాహసింపని విద్యాధికు లెందఱో యాయనకుఁ దోడుపడిరి. మొదటినుండియు విద్యార్థు లాయనకు సహచరులుగ నుండిరి. వీరేశలింగముగారి వితంతూద్వాహసంస్కరణము రానురాను దేశీయుల యామోదము వడసెను. ఆసంస్కరణ మిపుడు పల్లెలకును పట్టణములకును బ్రాకఁజొచ్చెను.

ఇట్టి వీరేశలింగసంస్కర్త శూరుఁడెకదా ! ఈతఁడు కట్టుకథలలోని ఓడిను, పరదేశవీరుఁడగు క్రాంవెలు, నరరక్తపాత మొనరించిన