పుట:2015.373190.Athma-Charitramu.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26. తమ్ముని వివాహము 323

జూచి సంతోషించితిని. సాయంకాలము పాపయ్యగారిని జూచి వచ్చితిని. వారి కొమార్తెను మాతమ్మునికిఁ జేసికొనవలె నని నాకెంతో మక్కువ గలదు. కాని మా యుభయ కుటుంబముల ప్రవరలకును విశ్వామిత్రఋషి. కలసి యీ కార్యమున కడ్డుపడెనని యాయన చెప్పెను. ఆ సంబంధమును వదలివేసి, మఱికొన్ని మే మప్పుడు వెదకితిమి.

నా "జనానాపత్రిక"ను ఆంధ్రదేశమందలి తమ బాలికాపాఠశాలల కన్నిటికిని దొరతనమువారు తెప్పించుకొనెడివారు. పత్రికలో 16 పుటలుమాత్రమే యుండుటచేత, తగినన్ని వ్యాసము లందుఁ బ్రచురింప సాధ్య మయ్యెడిదికాదు. కావున నీ జూలై నెలనుండియును చందా రెట్టింపుచేసి, పత్రిక విస్తీర్ణమును ద్విగుణీకృతము చేయ నిర్ధారణచేసికొని, ఈసంగతిని ప్రభుత్వపరీక్షాధిపురాలికిఁ దెలియఁబఱచితిని. దీనినిగుఱించి తమ యభిప్రాయ మేమని యామె యడుగఁగా, నామిత్రులును బళ్లారి సహాయపరీక్షాధికారియు నగు శ్రీ పి. రామానుజాచార్యులవారు తమ పరిపూర్ణానుమోదమును జూపిరి. కాని, రాజమంద్రి మండలోద్యోగియగు స్వామిరావుగారు ప్రత్యుత్తరము వ్రాయుచు, చందా యెక్కువచేయ వచ్చును గాని, పత్రికలో సంస్కరణవిషయములు ప్రకటింపఁగూడదని నుడివిరి. వారి వ్రాత యసమంజసము నప్రస్తుతము నని నేను దలంచితిని ! నేను సంఘసంస్కరణాభిమాని నైనను, వితంతూద్వాహములు సలుపవలె నని పత్రికలోఁ జాటుచుండుట లేదు. అపుడపుడు సంస్కరణమును గూర్చిన సంగ్రహవార్తలు మాత్రమే ముద్రించుచుంటిని. స్వామిరావుగారి హ్రస్వదృష్టికి ! నాకాశ్చర్యాగ్రహములు గలిగెను. ఈ విషయమై నాకు పరీక్షాధికారిణి బ్రాండరుసతి వ్రాసినలేఖకు