పుట:2015.373190.Athma-Charitramu.pdf/318

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 278

ఆరోజులలో ముఖ్యముగ రాత్రులందు నరకలోకమున నుండునట్లు నాకుఁ దోఁచుచుండెను. ఆబాధలో భగవంతుని ప్రసక్తియె నా మనస్సునకు గోచరించెడిదికాదు ! మీఁదుమిక్కిలి నే నాయనకు మఱపు వచ్చితి ననియె భావించుచుండు వాఁడను ! వివేకము తెచ్చుకొని కొంచె మాలోచించునపుడుమాత్రము, విసు వెఱుంగక అహర్నిశము నాకొఱకుఁ బరిశ్రమించు మాతాసతులమూర్తులందె దేవుని యవ్యాజ ప్రేమ కళ యొకింత నాకుఁ బొడగట్టుచుండెడిది !

మాతమ్ముఁ డంత నన్నుఁ బరీక్షించుటకై 24 వ జనవరిని డాక్టరు సార్కీసును మాయింటికిఁ గొనివచ్చెను. ఆయన నన్నేమియు నడుగక గోప్యాంగపరీక్ష చేసి, రుగ్ణత సుఖవ్యాధులచే సంక్రమింప లేదని నిర్థారణచేసికొని, మంచిమం దిచ్చెద నని నన్నోదార్చెను. నావేదనాప్రకోపమును, మాపర్ణకుటీరనివాస రహస్యమును గనిపెట్టిన యా సహృదయుఁడు మే మీయబూనిన పారితోషికమును గైకొనకయే వెడలిపోయెను. కొలఁదిదినములలో బెజవాడపాఠశాల తీసెదరు కావున, అచట నాకు బదులుగ బోధకుఁడుగ నుండి పనిచేయుటకై మాబావమఱఁది వెంకటరత్నమునకుఁ గబురంపితిని. అతఁడు 15 వ తేదీని వచ్చి పరీక్షాపత్రములు దిద్దుటయందు నాకుఁ దోడ్పడి, 17 వ తేదీని బెజవాడ వెడలిపోయెను. ఆనాఁడే వడ్లుపట్టుకొని మాతండ్రి రాజమంద్రికి వచ్చెను.

ఆమఱునాఁడు రాజమంద్రిలో మాయింటికిఁ జేరువనుండు డెబ్బది యెనుబది పూరిండ్లు తగులఁబడిపోయెను. మాకుటీరముకూడ పరశురామప్రీతి యగునని భీతిల్లితిమి. వేదనతో నుండియు ప్రాణము లందలి తీపిచే నేను గేకలు వేయఁగ, తమ్ముఁడు కృష్ణయ్యము