పుట:2015.373190.Athma-Charitramu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47. వ్యాధిగ్రస్తత 201

తేదీని "హిందూపత్రిక"లో నేను జూచితిని. ఇదియే నిజ మైనచో, మెట్కాఫ్‌దొర చెప్పినట్టుగ రాజమంద్రిలోని యున్నతపాఠశాలా విద్య యంతయు దొరతనమువారి హస్తగత మగును ! అందువలన మాయుద్యమమునకు తప్పక భంగము గలుగును. ఇది చూచిన మృత్యుంజయరావునకును నాకును మతి పోవునటు లయ్యెను. 6 వ ఆగష్టు ఆదివారమున, నేను మృత్యుంజయరావును గలసి చెన్నపురి వెళ్లి, హిందూపత్రికాధిపతియగు సుబ్రహ్మణ్యయ్యరుగారితో సంభాషించితిమి. రాజమంద్రికళాశాలనుగుఱించి నేను వ్రాయువ్యాసము లాయన తన పత్రికయందుఁ బ్రచురించుట కంగీకరించెను. "ఆంధ్రప్రకాశిక" పత్రికాధిపతులగు పార్థసారధి నాయఁడుగారు నిటులె చేయుటకును, నాకుఁ దమపత్రిక నుచితముగఁ బంపుటకును దయతో సమ్మతించిరి.

ఆసాయంకాలము మరల మేము సైదాపేట వచ్చునప్పటికె హిందూపత్రికకు నాప్రథమవ్యాసము పూర్తియయ్యెను ! మఱునాఁడె నే నది యాపత్రికకుఁ బంపివేసితిని. కడుపులోనివికారముతో బాధ నొందుచుండినను, వ్యాసరచనావ్యాసంగమున నే నుంటిని ! ఆదినములలో కామేశ్వరరావుభార్య పరశువాకములో జబ్బుపడుటచేత, ఆమెసహాయార్థమై నాభార్య నచటికిఁ బంపువేసితిని. నా కంతకంతకు శరీరమున వ్యాధి నీరసములు హెచ్చుచుండెను. ఒక నెల సెల వీయుఁడని వైద్యాలయాధికారియొద్దకుఁ బోయితిని. సర్టిఫికేటు "రేపిచ్చెదను, మాపిచ్చెదను" అని న న్నాతఁడు త్రిప్పి బాధించెను. కళాశాల రైటరుమాత్రము సజ్జనుఁడు, శాంతచిత్తుఁడును. నాకు సదుపాయము చేయుదునని యతఁడు వాగ్దానము చేసెను. నావ్యాధి దినదినమును ముదురుచుండెను. నాకు వైద్యుని సర్టిఫికేటు దొరకినను దొరకకున్నను, రాజమంద్రి పోయి ప్రాణములు దక్కించుకొన నేను నిశ్చ