పుట:2015.373190.Athma-Charitramu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 202

యించుకొని, 12 వ ఆగష్టు శనివారమురోజున మృత్యుంజయరావుతో పరశువాకమునకుఁ బయన మైతిని.

ఆకాలమున సుప్రసిద్ధవైద్యులగు వరదప్ప నాయఁడుగారియొద్ద మందు పుచ్చుకొనుచు, చెన్నపురిలోనే యుండు మని బుచ్చయ్యపంతులు గంగరాజుగార్లు నా కాలోచన చెప్పిరి. నాయఁడుగారి మందువలన నేను గొంచెము తెప్పిఱిల్లి, వెంకటరత్నమునాయఁడు గారు మున్నగు మిత్రులను సందర్శించుచుంటిని. కాని, 17 వ ఆగష్టు నుండి నావ్యాధి ప్రకోపించెను. నాయసహాయస్థితిఁ జూచి, నా భార్యయు, మిత్రుఁడు గంగరాజును గన్నీరు తెచ్చుకొనిరి. రాజమంద్రి తిరిగి చూచినఁగాని నాకు దేహస్వాస్థ్యము గలుగదని చెప్పివేసితిని. ఆమఱునాఁటిసాయంకాలము భార్యతో నేను రాజమంద్రి పయనమైతిని. ఈనీరసస్థితిలో నేను బ్రయాణము చేయవలసివచ్చినందుకు మిత్రులు విచారము నొందిరి.

ఐనను, రెయిలులో నాజబ్బు హెచ్చలేదు. కృష్ణానది యావలి యొడ్డున సీతానగరమునందు రెయిలు దిగి, యిసుకలో నడచి, చక్రముల పడవ మీఁద బెజవాడయొడ్డు చేరి, రెయి లందుకొను నప్పటికి, నాకు తలప్రాణము తోఁకకు వచ్చెను ! ఎటులొ రాత్రికి రాజమంద్రి చేరితిమి. "విశీర్ణగ్రామ" కథానాయకునివలె స్వస్థలముననే నేను స్వస్థుఁడను గాఁగోరితిని ! తలిదండ్రులు తమ్ములు చెలియండ్రును నాయెడఁ బ్రేమాతిశయమున నుండిరి.

రాజమంద్రి వచ్చినకొన్నిదినములవఱకును నాకు దేహమున ససిగాలేదు. ఇచట కనకరాజు వీరేశలింగముపంతులు మున్నగుమిత్రులు నన్నుఁ జూచిరి. రంగనాయకులునాయఁడుగారు, తియ్యనిమందు