పుట:2015.373190.Athma-Charitramu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 200

క్రొత్తనెచ్చెలుల సావాసమున నాభార్యకు విద్యయందభిరుచి కలిగెను. నాగురువర్యులగు మల్లాది వెంకటరత్నముగారు ఆజూలై నెలనుండియుఁ బ్రచురించెడి "తెలుఁగుజనానాపత్రిక" ప్రతులును, "సత్యసంవర్థనీ" పత్రికయును, ఇతరపుస్తకములందలి కథలు మున్నగు నవియును జదువుచు, నాభార్య విద్యయం దభివృద్ధిఁగాంచుచుండెను.

నా నీరసస్థితిని గ్రహించి కళాశాలలో ప్రథమోపాధ్యాయుఁడు నేను బోధింపవలసినపాఠములు తగ్గించెను. ఇప్పుడు నేను ప్రవేశపరీక్షకుఁ జదివెడి యొకవిద్యార్థికి తెలుఁగుమాత్రమే చెప్పవలెను.

రాజమంద్రిలోని క్రైస్తవపాఠశాలాధికారి తనవిద్యాలయము నందు ప్రథమోపాధ్యాయపదవి నా కిచ్చెద నని జూలైతుదిని వ్రాసెను. నా కిది యక్కఱలేదని యానాఁడే యాయనకుఁ బ్రత్యుత్తర మిచ్చి, యీసంగతి కనకరాజునకుఁ దెలియఁబఱచితిని.

కష్టసుఖములందును రోగారోగ్యములందును, పత్రికాపుత్రిక యగు సత్యసంవర్థని యభ్యున్నతికై నేను పాటుపడితిని. ఇప్పుడు నెలనెలయును ఆంగ్లేయవ్యాసములు నేనే వ్రాసి సరిచూచి పంపుచు వచ్చితిని. ఇవిగాక, వార్తలు విశేషములు, ఉల్లేఖనములును నేనే సిద్ధపఱచుచును, అప్పుడప్పుడు ఆంధ్రవ్యాసములు రచించుచునువచ్చితిని. ఇప్పుడు కనకరాజు పట్టపరీక్షకు కొలఁదిమాసములకే పోవలసినవాఁ డగుటచేత, ఆపరీక్ష మొదటితరగతిలోఁ జదువుచుండు నాతమ్ముఁడు వెంకటరామయ్య "సత్యసంవర్థనీ" సంపాదకత్వమున నాతనికి సహాయుఁ డయ్యెను.

రాఁబోవు సంవత్సరమునుండియు రాజమంద్రిలో మొదటితరగతి బోధనాభ్యసనకళాశాల నెలకొల్పఁబడు ననువార్తను ఆగష్టు నాలుగవ