పుట:2015.373190.Athma-Charitramu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 186

నిశ్చయించిరి. నేనును వ్రాయుచుందు నని వాగ్దానము చేయకుండినను, నాచేతనైనసాయము చేయ నుద్దేశించుకొంటిని.

మద్రాసులో నేను పలుమాఱు వెంకటరత్నము నాయఁడుగారిని సందర్శించి, ఆత్మోజ్జీవనమును గుఱించియు, దుష్టసంకల్పముల నరికట్టి మనస్సును ఋజుమార్గమున నడిపించు విషయమును గూర్చియు, వారి యమూల్యాలోచనములను గొనుచువచ్చితిని. వైద్యుఁ డయ్యును నారాయణస్వామి నాయఁడుగారికి మత ధర్మములను గుఱించి మంచి యనుభవము గలదు. పలికెడి పలుకులందుకంటె చేసెడి కార్యములందాయన సౌజన్యము బాగుగఁ గానవచ్చు చుండెను. ఏమాత్రము విసివి కొనక, నాకోరికచొప్పున నామిత్రుల కెల్ల నాయన యుచితముగనే వైద్యసహాయము చేయుచుండువారు.

చెన్నపురియందుఁగూడ నేను ఆరోగ్య విషయమున మిగుల జాగరూకతతో నుండువాఁడను. మిగుల మితముగఁ జదువుచు, సాయంకాలమున సముద్రతీరమునఁ జాలసేపు చల్లనిగాలి ననుభవించుచు, నేను దినములు గడపుచువచ్చితిని. దేహమున పుష్టి గలుగుటకును, కనులకుఁ జలువ చేయుటకును నేను వలసిన మందులు సేవించుచుండువాఁడను.

ఎట్టకేలకు పరీక్షాదినములు వచ్చెను. మొదటి పరీక్షాపత్రము చేత నందుకొనిన పావుగంటవఱకును నందలి విషయములు నామనస్సున కెక్కలేదు ! నేనీ పరీక్షయందు తప్పినచో ముందు కుటుంబపోషణ నెట్లు జరుగునా యని నే నాలోచింపఁ దొడంగితిని. అంత నేను మనసును పరీక్షాప్రశ్నల దెసకు మరలించుకొంటిని. పరీక్ష రెండవనాఁడు ప్రొద్దుననే, న న్నదివఱకు సంవత్సరముల కొలఁది వేదించుచు