పుట:2015.373190.Athma-Charitramu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29. చెన్నపురి ప్రయాణము 131

రిణి" అను మాసపత్రికను నెలకొల్పి, పంతులు జరుపుచుండెను. బుచ్చయ్యపంతు లిపుడు హిందూమత పునరుద్ధారణము ప్రధానాదర్శముగఁ జేసికొని, పండితులసాహాయ్యమున నర్థతాత్పర్యసహితముగ హిందూధర్మశాస్త్రము లాంధ్రమునఁ బ్రకటించుచుండిరి.

మే 2 న తేదీని బళ్లారి "సరసవినోదినీ నాటకసమాజము" వారు తాము ప్రదర్శించెడి యొక నాటకమునకు వీరేశలింగముపంతులుగారి నాహ్వానింపఁగా, నేనును వెళ్లితిని. నాటకము మిగుల రమ్యముగ నుండెను. ఆ మఱుసటిదినము పంతులుగారితోఁ గలసి బ్రాహ్మమందిరమున కేగితిని. ఉపాసనసమయమున సామాజికు లందఱును గలిసి కీర్తనలు పాడుటకు మాఱుగా, జీతమునకుఁ గుదిరిన యొకపాటకుని గీతము లూరక వినుచుండిరి ! ఇది నాకు రుచింప లేదు. వీరేశలింగముగా రంతట "ఐహికాముష్మిక సుఖముల"నుగూర్చి యుపన్యాసముచేసిరి.

నేను చెన్నపురిలో నుండురోజులలోనే, స్విప్టువిరచిత మగు "గల్లివరునిప్రయాణముల" ననుసరించి, "సత్యరాజాపూర్వదేశయాత్రలు" అను విచిత్రకథను పంతులుగారు రచింపఁదొడంగిరి. ఏనాఁడు వ్రాసిన ప్రకరణముల నానాఁడు పంతులు నాకుఁ జదివి వినిపించి, నాయభిప్రాయము గైకొనుచుండెను. ఓడప్రయాణమందలి నాబాధలసంగతి నేఁ జెప్పగా విని, సమయోచితముగ నందుఁ గొన్నిటిని సత్యరాజున కాయన యారోపించుట చోద్యముగ నుండెను. హాస్యరసకల్పనా విషయమున పంతులుగారు అడ్డిసనునికంటె స్విప్టునే యెక్కువగఁ బోలియుండె నని నే నంటిని. అడ్డి నుని మృదుహాస్యప్రయోగము తెలుఁగునఁ జొప్పింప పంతులయాశయము. అది కడు దుస్సాధ్య మని నేను జెప్పితిని. పంతులుగారి నిరంతరపరిశ్రమము నా కాశ్చర్యానందములను గొలిపెను. వారివలెనే నేనును పాటుపడనెంచి, నే నక్కడ