పుట:2015.373190.Athma-Charitramu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 130

బ్రాప్తింపని పంతులుగారి నిరంతరసహవాసభాగ్యము నా కిచట లభించెను. నీతిమతసాంఘికసాహిత్యాంశములందు ఆమహనీయుని యూహలు నుదారాశయములును నే నిపుడు గ్రహించి యానందింపఁ గలిగితిని. భార్యయగు రాజ్యలక్ష్మమ్మగారితోను, అభిమానపుత్రకుఁడగు చిన్న వీరేశలింగముతోను, ఆయన మాటాడి మెలఁగుచుండురీతి నేను గనిపెట్టితిని. వ్యర్థకాలక్షేపము చేయక, పంతులుగారు సదా సద్గ్రంథపఠనమునను, పుస్తకరచనమునందును లగ్న మానసు లై యుందురు.

29 వ తేదీని నా కనులు డాక్టరు బ్రాకుమను పరీక్షించి, అందేమియు జబ్బు కానఁబడకపోవుటచేత, నే నింటికి వెడలిపోవచ్చు నని చెప్పివేసిరి. ఇది సంతోషకరమైన సంగతి యైనను, కనులముం దాడెడి చుక్కలనుగుఱించి వైద్యుఁడు ప్రస్తావింపకపోవుటచేత, ఆయన వానిని గుర్తింపలేకుండెనేమో యని నేను సంశయమందితిని. ఐనను, నేత్రవైద్యవేత్త యగు బ్రాకుమనుని నిశ్చితాభిప్రాయము నే నెట్లు శిరసావహింపకుందును? కావున నేను తిరుగుపయనమున కాయత్తపడితిని.

మే 1 వ తేదీని వీరేశలింగముగారితోఁ బోయి, రాజధానీ కళాశాలను జూచితిని. అందలియాంధ్రభాషావర్ధనీసమాజసభ కాయన యధ్యక్షుఁడై యొక చక్కనియుపన్యాస మొసంగిరి. బుచ్చయ్యపంతులుగారు, బ్రాహ్మమతస్వీకారమునుగూర్చి నాతో మనసిచ్చి మాటాడిరి. అదివఱ కాయన చిరకాలము మద్రాసునందలి బ్రాహ్మ సమాజనున సభ్యులుగ నుండి, సమాజాభివృద్ధికై మిక్కిలి పాటుపడి, మందిరనిర్మాణముఁ గావించిరి. ఆ సమాజమువారికిని పంతులుగారికిని సరిపడనందున, వారినుండి యాయన విడిపోవలసివచ్చెను. అంత మద్రాసున స్వంతముద్రాలయమును స్థాపించి, "హిందూజన సంస్కా