పుట:2015.372978.Andhra-Kavithva.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ


రానధికార భేదము లేకుండ నావస్తువుం దిలకించిన సెల్లరకు నేక రీతిని దైక్ష్ణ్యమునఁ దారతమ్యము లేకుండ గోచరించునా? చదువు రానిమూడునకును, బుద్ధిమాంద్యముగల జడునకును, బ్రపంచజ్ఞానము లేని పసిబిడ్డలకును వస్తువుల నిబిడమైయున్న రసము గోచరించునా?' మీరు చెప్పినట్లు రసము వస్తువునకుఁ బ్రథానవి శేషణమేని నది యెల్లరకును గోచరింపవలదా? అట్లు గోచరించుచున్నదా? గోచరింపనిచోఁ గారణమేమి? అట్టియెడ రసమునకు భిన్నా శ్రయత్వము నాపాదింతురా?' ఈ ప్రశ్నకు సమాధాన మివలయునన్నఁ గొంచెము తర్కవిషయమున వాదము సలుపపలయును.

విశేషణమునకు విశేష్యమునకుఁ గలసంబంధము.

విశేషణ మన నేమి ? అది యెట్లు వ్య క్తమగును? విశేషణము వ్యక్తమగుట వస్తువు యొక్క స్వభాపబలముననా? లేక, యుపలకించు ద్రష్టయొక్క దృష్టి బలముననా! వస్తువును విశే షణమును వేఱుగావు. ఎట్లన! తియ్యందనము పంచదారకు విశేషణము, పంచదార నోటనిడుకొనిన నెల్లరకును దియ్యం గనేయుండును. ఒక్క సర్పదష్టులకుందక్క, ఈ భేదమునకుఁ గల కారణము సరయుదము. తియ్యఁదనము పంచదారకు విశ్లేషణ మగుటం జేసి సాధారణముగ నందజుకును బంచదార తియ్యంగ నుండునట్లు చేయును. కానీ.. సర్పదష్టుఁడై నవానియందు వ్యాపించు విషము పంచదారయొక్క తియ్యందనమును దష్టు నికి దోఁపకుండఁ జేయును. ఈ భిన్నత్వమునకుఁ గారణము విరుద్ద విషబలమే కాని వస్తువునందలి విశేషణము యొక్క సర్వ సమత్వాభావము గాదు. పంచదార యెప్పటికిని దియ్యనిదే,