పుట:2015.372978.Andhra-Kavithva.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయప్రకరణము.


రసస్వరూపనిరూపణము.

'రసాత్మకం వాక్యం శాప్యమ్' అను కాప్య సూత్రము 'నంగీకరించిన పిదప రసమన నేమియో, ధర్మార్థ కామమోక్ష సంయుతమగు మానవధర్మమున దాని కాశ్రయ మేద్దియో, దానిస్వరూప మేమో చర్చింప నవసరము గలుగుచున్నది, ముందుగ రసమన నేమో దానియాశ్రయ మెద్దియో విచా రించి పిమ్మట కావ్యమున వర్ణితమగు రసముయొక్క ప్రత్యేక స్వరూప మెట్టిదియో తెలిసికొందము.

రస మననేమి?

రసమునకు వ్యుత్పత్తి ననుసరించి 'ఆస్వాదింపఁబడునది' 'యని అర్థము కలుగుచున్నది. స్థూలముగఁ జెప్పిన రసము మానవ హృదయముల నాకర్షించు శక్తిగల వస్తుసౌందర్యమే. ఎట్లన? నాస్వాదింపఁబడు వస్తువునందు నాస్వాదింపఁబడుట కర్హతగల గుణవిశేష ముండి తీరవలయును. ఆగుణవి శేషమువలననే మను జుఁడు వస్తువు నాస్వాదించుట సంభవించుచున్నది. కావున రసమనునది వస్తుగుణవి శేషమునకు సంబంధించిన రనుభావము స్ఫురించుచున్నది. దానికిఁ బూర్వపక్షముగ నింకొక ప్రశ్న ముదయించుచున్నది. తార్కికు లిట్టి ప్రశ్నలను లేవదీయు టలో నేర్పరులు. ఆ ప్రశ్న మేమన. 'అయ్యా! రసము వస్తుగుణ విశేషము నాశ్రయించు ననుచున్నారే! అట్లయినచో రసము వస్తువునకు విశేషణమని చెప్పందగునా? అట్లు రసము వస్తు ప్రథాన విశేషణములలో నొకటి యయినచో నారసమధికా