పుట:2015.372978.Andhra-Kavithva.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము,

81


కాని విరుద్ద విషబలమున సర్పదష్టునికి ,బంచదార యెప్పుడును దీయ్యఁగ నుండదు. అట్లే రసము వస్తువునందు విశేషముగ నుండుననుట సత్యమ. కాని, దర్శించుద్రష్టయొక్క చిత్త పరిపాకము ననుసరించి రసము గోచరించును. చిత్తపరిపాకము లేని వారికి వస్తువులందు నిబిడ మైయుండు రసము గోచరింపదు. ఎట్లన, సర్పదష్టునకుఁ బంచదారతియ్యందనము గోచరింపని యట్ల, విశేషణమునకును, విశేష్యమునకునుగల యవినాభావ సంబంధము ద్రష్టృదృష్టి ప్రసారము లేనిది బయల్పడదు. ఎట్లనం బంచదారలోని తియ్యందనము విశేషణముగ మన మంగీకరించితి మే. ఆ విశేషణము అనఁగా నాతియ్యందనము మొట్ట. మొదట నెట్లు బయల్పడియెను?' ఎవరో యొకమనుజుఁడు నాలుక పై వై చికొని రుచి ననుభవించి తీయ్యఁగ నున్న దని చెప్పుటవలననే కదా! కానఁ బంచదార యొక్క తియ్యందనము రుచిచూచిన జిహ్వేంద్రియము లేనిచోఁ బ్రపంచమునకు వ్యక్తము కాదుగదా.

రసికుఁడు లేనిది రసము జనింపదు.

కావున రసికుఁడు లేనిది రసమసంభవమని సారాంశము. పోనిమ్ము రసికుఁడే రసమును సృష్టిం చెనందమా? పంచదార తీయఁదనమును నాలుక కనుఁగొనినదా? సృష్టించినదా? నాలుక సృష్టింపఁగల్గినచో నుప్పును దీయఁగా 'నేల చేయ లేదు? పై నఁ జెప్పిన సర్పదష్టుని సమయ మిచ్చటఁగూడ గ్రాహ్యము, నాలుక యుప్పును దియ్యఁగఁ జేయ లేనటులే రసికుఁడును, విశే షణయుక్తవ స్వభావత్వమున రసము ననుభవింప లేఁడు విశే

ఆంధ్ర కవిత్వ......6