పుట:2015.372978.Andhra-Kavithva.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ



పటములను నెల్ల విషయము లాథ్యాత్మిక దృష్టితో వర్ణింప బడవలయుననియుఁ, గావ్యము శిల్పముఁ జిత్ర రచన మొదలగు వానియందలి రస ప్రవృత్తి యాధ్యాత్మికతత్వమునకును, ఆధ్యాత్మికశక్తికిని, ఆధ్యాత్మిక తేజమునకును, సంజ్ఞామాత్ర, కముగను, ఉపాధి మాత్రముగను నుండఁ దగుననియు, రస ప్రవృత్తి తనంతటఁ దాను మానవునకుఁ బ్రధాననిరీక్షణము గాఁదగదనియు, నాత్మకు జీవుఁడుపాధియగున ట్లాధ్యాతి కజ్ఞాన మునకు రసప్రవృత్తి గలకళలు సాధన మాత్రములు సంజ్ఞా మాత్రములును నుపాధిమాత్రములును నగుననియే వీరిమతము.

భారతచిత్ర శిల్పములసిద్ధాంతము.

ఈమతమును బురస్కరించుకొని వీరు భారతశిల్పమును విమర్శించుచు నాధ్యాత్మిక జ్ఞానోపలబ్దికి సోపానము లనందగు భగవదవతారములను, వానియొక్క లీలలను, శక్తులను, ప్రదర్శించు శిల్పములనే యుత్తమములని యంగీకరించి, యయ్యవియే యాదర్శ ప్రాయములనియు శాసించి, యెల్లోరాగుహ అజంతా, కార్లీ మొదలగు గుహలలోని శిల్పములను, నందు ముఖ్యముగ నటరాజ, కాళీ, థ్యానిబుద్ధ "మొదలగువి గ్రహముల యాథ్యాత్మికశక్తి ప్రదర్శనమును " నాధ్యాత్మి కజ్ఞానోత్తేజక ప్రతిభయును బ్రశంసించి, ప్రసంగవశమువఁ గావ్యమునకును నట్టి మహద్విషయములే యాదర్శ ప్రాయములని నిరూపించిరి. చిరకాలమునుండియు విదేశమున నివాసముగ నుండిన, కతముననో యేమో వీరు భారత సాంప్రదాయమును సర్వతో ముఖముగ ననఁగా నందలి దేశ కాలప్రాంతానుగతములగు యవలక్షణములతో సహితము సమర్థింపఁ జూచుచు నూత