పుట:2015.372978.Andhra-Kavithva.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం. కావ్యమ్.

65



దై కమయత, స్వాతంత్ర్యము, అనన్యపారతంత్ర్యము, రసబంధురత్వము గావ్యమునకు ముఖ్య లక్షణములుగ శాసించి రసాత్మకం వాక్యం కావ్యమ్' అను నిర్వచనమునకుఁ గల పరిపూ ల్లాన్వయమును విశదపఱచినాఁడు. ఇంత వఱకును, విశ్వనాథుని, నిర్వచనమును, మమ్మటుని వ్యాఖ్యానమును, గావ్యలక్షణ ములలో నెల్ల సమంజసములుగ నున్న వని యెప్పుకొనక తప్పదు.

ఆధ్యాత్మిక కావ్యమతము.

కాని యాధునిక కావ్య ప్రపంచము నాథ్యాత్మికపథము నకుఁ ద్రిప్పఁజూచు విమర్శకులు కొందఱు బయలువెడలు చున్నారు. వీరిలో నెల్ల నానంద కుమారస్వామిగారును, యోగి సత్తముఁడై భారత భాగ్య నిధానమనఁదగు నరవిందఘోషు, గారును, భారతీయ కవికులతిలకుఁ డసందగు రవీంద్రనాథ శాకూరుగారును ముఖ్యులు. వీరలమతమును ప్రస్తుతము సంగ్రహముగసు ప్రసక్తిగలిగిన చోట విపులముగను దెల్పెదను.

ఆనందకుమారస్వామి, కావ్యము -. ఆధ్యాత్మికశక్తికి సంజ్ఞా రూపకము. )

ఆనందకుమారస్వామిగారు గొప్ప శిల్పతత్త్వవేత్త. భారతీయ శిల్పమును గూర్చి యభిప్రాయ మీఁగలయధికారి. భారత. శిల్పతత్త్వమును సూచించుచుఁ బ్రసంగవశమున వీరు కొవ్య: తత్త్వమునుగూడ నిరూపించిరి. వారిమత మేమన? భారతజాతి, యాథ్యాత్మికదృష్టి బలమున శుద్ధసత్యమును గ్రహింపఁగలిగే ననియు, మానవజీవితపరమావధి భగవంతునితత్త్వమును శక్తిని, గ్రహించుటయే యనియుఁ, గాప్యములను శిల్పములను జిత్ర, ఆంధ్ర కవిత్వ---5