పుట:2015.372978.Andhra-Kavithva.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


కరణు లతిరథులు. పాణిని యేపుణ్య దివసమున భూమి పై నవత రించెనోకాని, యానాఁటి నుండియు నీ వైయాకరణులయధికారము నిరంకుశముగను, నిర్వికల్పకముగను పొంగుచునే వచ్చినది.

వ్యాకరణశాస్త్రము,

దీనికి ప్రధాన కారణము వ్యాకరణమును సాయభి మానియగు పాణిని వేదాంగముగ నిర్ణయించుట చే చానికి నమిత గౌరవమును, గవిని బంధింపఁ గలుగునంతటి యధి కారు మును మనవార లొప్పుకొని శబ్దశుద్ధియని సాకు పెట్టి, కవియొక్క స్వచ్ఛందవృత్తికి భంగము నొదవించుచు వ్యాకరణమునకు జోహారు లొనరించు చుండుటయుఁ, గవులు వైయాకరణుల దౌర్జన్యమునకు వెఱచి వారియధి కారమునకు లోబడి స్వస్వ రూపమును గుర్తింప లేకపోవుటయునే! -

వ్యాకరణశాస్త్ర ప్రయోజనము.

వ్యాకరణ మన నేమి ? శబ్దశ్శుద్ద్గి యన నేమి ? ఈ రెంటికిని గవికర్మకును సుబంధ మేమి ? వ్యాకరణమనఁగా శబ్దముల స్వరూపమును సాధుత్వమును జర్చించి నిరూపించు శాస్త్రము. శబ్దశుద్ధియన వ్యాకరణ నియమానుసారముగా శబ్దములకు నలవడు నిశ్చితమయిన రూపలక్షణాదులే, దానినిగూర్చి సంది యముగాని, వివాదముగాని లేదు. కాని "వైయాకరణుల నియమములు కవిననుసరించునా? లేక కవిని తాబేదారుగా గొని యిష్టానుసారముగ నడపించునా?" ఈ ప్రశ్నకు సమాథానము నించుక నిష్పక్షపాత బుద్ధితోడను దత్త్వాన్వేషణా సక్తితోడను నరయుదము,