పుట:2015.372978.Andhra-Kavithva.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసాత్మకం వాక్యం కావ్యమ్.

27


యెడలఁ గవితయందునుగూడఁ దలచూప నెంచుచున్నది. కాని యింతలో లోకభీమమగు నీమహాసంగ్రామము ప్రాప్తించి యుంటచే వాజ్మయము స్తంభించి పోయినది. ఇఁకముందు నేపరి నామముఁ దాల్చునో చెప్పుట దుస్తరము.

కవి నిరంకుశుడా!

కావునఁ గవి సృష్టికర్త యనియుఁ బ్రతిభాశాలి యనియు నొప్పుకొన్న తోడనే వేరొక ప్రశ్న మున కవకాశము గలుగుచున్నది. ఆ ప్రశ్న మెద్దియనఁ గవి నిరంకుశుఁ డా? కవిని బంధింపఁగల నియమము లేమైన నున్న వా? యనియే. ఈ ప్రశ్న మునకు సమాధాన మీవలయునన్నఁ గొంచెము చర్చలోనికి దిగవలసివచ్చును. ఆచర్చ భిన్న భిన్న శాస్త్రములపై దాడిగాఁ బరిణమింపఁగలదు. అందుచే నేను శాస్త్రములయెడ గౌరవము లేని వాఁడనని భావింపఁదగదు. సాహిత్య శ్రేయోభిలాషినై సాహిత్యస్వచ్ఛంద ప్రవృత్తికి నిరోధములగు నియమముల నాపొదించు వివిధశాస్త్రముల నొక్కింత చుఱచుఱఁ జూచి దూరముగఁ దొలఁగిపోవ నానతీయ దొరకొందును.

శాస్త్ర శృంఖలావిచ్చేదము.

ఈ ప్రప్రథమమునఁ గవి నిరంకుశుఁడని స్థాపించుట నాయభిమతము. కవిని బంధించుటకయి మనవారు తయారుగావించిన శాస్త్ర శృంఖలలను ఛేదించుటకుఁ బ్రయత్నింతును. లాక్షణిక, వర్గమునకుఁ జేరినవి మర్శకులందఱును “అదోపౌ, సగుణె, సాలం శారౌ" అనుమాటలను దమ విజయపతాకల పై విలిఖించి కవిని బ్రతిఘటింపఁ జూచుచున్నారు. లాక్షిణిక సైస్వముల నతిరథులు,, మహారథులు, నరథులుఁగూడ నున్నారు. వీరిలో వైయా