పుట:2015.372978.Andhra-Kavithva.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్.

29


వ్యాకరణము స్వాభావిక శాస్త్రికమని ద్వివిధము.

కావ్య విషయమునఁబోలె వ్యాకరణ విషయమునను భిన్న మతముల కవళాశము కలదు వ్యాకరణశాస్త్ర మనుసంధించుటలో రెండు పద్ధతులు వ్యవహారయోగ్యములు. అవి యేవ్వి యనిన? స్వభావపద్ధతి, ప్రమాణపద్ధతియును, స్వభావపద్ధతి నను సరించి వ్రాయఁబడు వ్యాకరణముల శిష్టజన వ్యవహారమేగాక గ్రామ్య జనవ్యవహారముపై తముఁ బడసిన పదజాలముఁ గొని శబ్ద స్వరూప నిర్ణయమును విశాలదృష్టితోఁ గావించుటయే వైయా కరణులు కావింపఁదగుపని..

స్వాభావికవ్యాకరణ శుద్ధతి.

పదముల నన్నిటీ నున్నవి యున్నట్లుగ సుగ్రహించి స్వరూప నిర్ణయము గావింపవలెను. "కాని “ఈ రూపము సాధువు, ఇవయసాధువు ” నను శాసనములకు నెడమిచ్చి వైయాకరణులు నిషేధ మార్గము ప్రసాదింపఁగూడదు. ఈస్వాభావిక వ్యాకరణముల సూత్రములు మితసంఖ్యాకములు. సృష్టి కెల్లను సూత్రా త్మకములనఁదగు ప్ర ధానసూత్రము లెట్లు మిత సంఖ్యాకములు గను నిర్వికల్పములుగను నుండునో యట్లే స్వాభావిక వ్యాకరణ మూల సూత్రములు కొలఁదిగనే యుండి సర్వ ప్రపంచ సామాన్య ములును సర్వ భాషాసామాన్యములును సర్వదేశ కవిజనాదరణీయంబులును నైవర్తించుచుండును. ఇందులకు దాహరణములు వచన - లింగ - పురుష • కాల-విభేదాదులఁ గూర్చిన నియమములు.