పుట:2015.372978.Andhra-Kavithva.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ



భాలరామాయణ బాలభారత కర్పూరమంజరీ కావ్యమీమాంసాది గ్రంథముల రచించిన రాజశేఖరకవి.. కావ్యరచనాశక్తి నిశ్చయముగఁ బ్రతిభ యేయనియు, నయ్యది జన్మాంతరసంస్కా రమువల్ల నే లభ్యముగాఁగలదనియుఁ, బ్రపంచమున మహాకావ్య ముల రచియించిన కవి శ్రేష్ఠు లెల్లరును జన్మాంతర సంచిత ప్రతిభాశాలురే యనియు సిద్ధాంతముఁ గావించి కవులకు ఈసిద్దాంతము ననుసరించి సహజ ఆహార్య ఔపదేశిక కవు లనుమూఁడు తరగతులుగ విభజించెను. నాకుంజాడఁ గావ్యవస్తుతత్త్వమును బ్రధానలక్ష్యముగ సుంచుకొని కవుల గుణతారతమ్యములఁ జర్చించి వారికి యథోచిత గౌరవము నొసుగఁ బ్రయత్నించిన వారిలో నెల్ల రాజ శేఖరుఁడే యగ్రగణ్యుఁడు. ఈతడు గావించిన తారతమ్య నిర్ణయము సంగ్రహముగఁ జెప్పెను. జన్మాంతర సంస్కోరబలిమి నపూర్వ ప్రతిభావి శేషమున ననన్య సాహాయ్యముగ మహా కావ్యసృష్టిం గావింపఁగల యపర బ్రహల సహజకపులని నిర్ణయించెను. పిమ్మట జన్మాంతరసంస్కారము లేకుండినను సత్కా-వ్యపఠనమువల్లను, గురుకుల వాసమువల్లను బుద్దివైశద్యముఁ బడసి కావ్య నిర్మాణమునకుఁ గడంగునిహజ న్మసంస్కార శేముషీ ధురంధరులగు కవులను నాహార్యకవులఁగా నిర్ణయించెను. తరువాత మంత్రతంత్రోపాసనా బలమునఁ బ్రతిభయు నిహజన సంస్కారమును మృగ్యములుగఁ గవనము నల్ల సాహసించు తక్కుంగలకవులను సౌపదేశికు లని నిర్ణయిం చెను. కావున రాజ శేఖరుని మతము ప్రకారము కావ్యము రచింప గల్గుశక్తి జన్మాంతరసంస్కారమువల్లఁ గాని యిహజన్మసంస్కారముపల్లంగాని జనింపవలసిన దేకాని మంత్రతంత్రాగివిద్యల సభ్యసించుటవల్లఁ గలుగ నేరదనియుఁ దేలుచున్నది. కావున