పుట:2015.372978.Andhra-Kavithva.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసాత్మకం పోక్యం కావ్యమ్.

15


రణముగఁ గుండలునేయుకు మరియు, బిందెలఁ గరఁగించిపోత బోయుఁ గమ్మరియు, బంగరుఁ గరఁగించి నగలు చేయు కంసాలియు, నిశితమయిన సృష్టిశ క్తిగొని నిస్త్రాణశక్తిగాని కలిగి యుందురని చెప్పుటకు వీలు లేదు. కరఁగించి యిదివజుకున్న యచ్చులలో బోఁతపోయుచు నొకదానినొకటి పోలినవగు వేన వేలువస్తువులను శీఘ్ర జాలమున నొక్కొక్క వస్తువునకుఁ బ్రత్యేకపరిశ్రమ మక్కర లేకుండఁ దయారు సేయఁగల కుమ్మరి, కమ్మరి, కంసాలు లాదిగాఁగల కర్మకారులను సృష్టికర్తలనిగాని నిర్మాతలనిగాని నొడువుటకు వీలగునా? అట్లే దృష్టి వైజ్యాలము గాని నిర్మాణ కౌశల్యముగాని లేక యూరక పుస్తకములఁ జూచి పుస్తకములను, గావ్యములఁ జూచి "కావ్యములను, బద్దెములఁ జూచి పద్దెములను, ప్రయోగములఁ జూచి ప్రయోగములను రచింపుము నను కరణములఁ గావింపుచుఁ బర ప్రత్యయ నేయబుద్దు లగు నంగటికవులు అత్యంత గౌరవప్రదమగు కవినామమున కర్హులు కాజాలరు. సామాన్య ప్రబంధ కవు లెల్లరు నీ తెగకుఁ జేరుదురు. వీరినిగూర్చి ప్రసక్తి గల్గునవసరమున మున్ముందు విపులముగఁ జర్చించుట కవకాశము గలదు గావున ప్రస్తుతము దీని నింతటితో విరమించి వేఱుచర్చకుఁ గడంగుదుము.

రాజ శేఖరకవిరాజుమతము (సహజ) 

ఆహార్వపండిత ఔపదేశిక (ఉపాసక) కవులు.

పై నఁ జెప్పఁబడిన సంగతులనుబట్టి ప్రపంచమునకుఁ బ్రతి ప్రపంచమును సృష్టింపఁగల మహాశక్తిగాని, సర్వాంగ సుందరముగ నుపలబ్దములయిన సాధనములఁ గావ్యరూపమున నిర్మిం పఁగల నిశితనైపుణిగాని, కవికుండవలసినశీ క్తులలో ముఖ్యము లని తేలుచున్నది. ఈయభిప్రాయముఁ బురస్కరించు కొనియే