పుట:2015.372978.Andhra-Kavithva.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం శాద్యమ్,

17


గవి సృష్టికర్తయైన కాని నిర్మాతయైన కానీ కావలెను. రాజ శేఖ రునిపరిభాషలోఁ జెప్పినకవి సహజకవియైనం గావలయు లేక పండిత కవియయినఁ గావలయు. కాని వట్టికర్మ కారునిఁ బోలిన కావ్య శారుఁడు అనఁగా నౌపదేశికకవి కారాదు. .

'పై యభిప్రాయము సాధారముగాఁ గొని రాజ శేఖరుఁడు మహాకవులను తరగతుల ప్ర కారము విభజించి కవిత్వలక్షణ మును నేతదభిప్రాయానుసారముగ నిర్వచించినాఁడు. ప్రసక్తి గల్గిన చోట రాజ శేఖరుని కావ్యలక్షణనిర్వచనమును సంద ర్భానుసారముగాఁ జర్చింపఁ బ్రయత్నింతము.

కావ్యసృష్టికిని, బాహ్య సృష్టికిని గల సంబంధము.కావ్యము బాహ్యసృష్టి కనుకరణ మగునా? లేక స్వతంత్ర జీవియగునా? భిన్న మతములు


కవి సృష్టికర్త యనియు నిర్మాత యనియు నొప్పుకొనిన పిదప నొక ప్రశ్న ముదయించును. అది యేదనఁగా: కవి సృష్టించు ప్రపంచమునకును పరమేశ్వరకల్పితంబగు నీబాహ్య సృష్టికిని సంబంధ మెట్టిది? కావ్య ప్రపంచము బాహ్య ప్రపం చము ననుకరించునా? లేక దానిని మీటి స్వతంత్ర ముగ వర్తించునా? కవి బాహ్య ప్రపంచమును జూచి దాని కనుకరణముగ, ఛాయా పటముఁ దీయువాఁడు మానవునీ రూపమును బ్రదర్శించునటులఁ గావ్య ప్రపంచమును బ్రదర్శించునా?-- ఈ ప్రశ్నమును, దీనికి సమాధానమును, నీ రెండింటికిని సంబం ధించిన వాదోప వాదములును, పాఢ్చాత్య కావ్య ప్రపంచమును సుమారు రెండు వేలయేండ్లుగ సంక్షుభితముఁ గావించినవి. 'నేఁటి ఆంధ్ర కవిత్వ-2