పుట:2015.372978.Andhra-Kavithva.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసాత్మకం వాక్యం కావ్యమ్.

11


కావ్యమునందలి లోపములపై కిని, చిల్లర మెఱుఁగులపైకిని వారిదృష్టి చనదు. లోపరహితమగు నుత్తమసౌందర్యముకన్న గించిల్లో పసహితమయ్యు జీవసంపత్తికలుగు సహజలావణ్య మే వారి కెక్కువయింపు నింపును. ఈమతాభిప్రాయ భేదములపరి ణామము కావ్యవిషయమున ననేకవిధములగు వాదోపవాదము లకుఁ గారణ మైనది. అట్టివాదములను సందర్బోచిత్యము నను సరించి చర్చించెదను.

లాక్షణికరసికమతములకుఁ గల భేదము,

వామన, మల్లినాథాదిలాక్షుణికులు కావ్యమున నలం' కారములుసు, గుణములును, రీతులును, శబ్దశుద్దియును, నదో షమును బ్రధానము లనుచున్నారు, రసికవర్గమునకుఁ జేరిన దండి, విశ్వనాథ, మమ్మట, జగన్నా థాదులు రసము, వ్యంగ్యము, ఇష్టార్థము, హ్లాదై కమయత, అనన్య పారతంత్ర్యము మొదలగు లక్షణములే కావ్యమునఁ బ్ర ధానము లనుచున్నారు. కావున వీరి మతములు రెంటికిని ముఖ్యమును, పరిస్ఫుటమును నగు భేదము కలదు. ఈ భేద మెద్దియో పరికించి పిమ్మట నీ భేదమునకుఁ బరిణామములుగఁ బెరిగిన సాహిత్య విషయిక వివాదములను సత్యా న్వేషణబుద్దితోడఁ బరిశీలించి సత్యమును నిరూపింపఁ బ్రయ త్నింతము. వీరికిఁ గల భేదమును నామిత్రులొకరు "సాహిత్య చర్చ" యను వ్యాసమునఁ జక్కఁగ నీ క్రింది వాక్యములు బొందుపఱచినారుః---

"నాకుఁ జూడ ప్రథమపీఠమువారికి నిషేధము లేక్కువ రెండవపీఠమువారికి విధము లధికము. కవి సృష్టికర్తయనియుఁ, గోవ్యము సజీవనబింబమనియు, రెండవవారు ఆర్ద్ర దృష్టితో