పుట:2015.372978.Andhra-Kavithva.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ

10



నేరదు. కావ్యమునఁ గొన్ని విషయముల మనతోబాటువారును, గొన్ని గుణముల మనకన్న మిన్నలును నగునాయికానాయకులే భావోదయముఁ గలిగింతురు. కాని సర్వవిషయముల మనకంటే మిన్నలును మనతో నేసంబంధమును లేనివారునునగు దేవత లాది గాఁగల నాయికానాయకులు భావోత్పత్తి గలిగింపజాలరు. రంభా సౌందర్యముకన్నఁ బ్రేమభాజనమగు నిల్లాలి ముఖబింబ లావణ్య మెన్ని కోట్ల మడుంగు లెక్కు.పభావోద్దీపకముకాదు? ఈభావమునే "సహజలావణ్య" మనుగీతమందుఁ దెలీపి యుంటిని:---

మోముతీరు సామాన్య మే ముగుద, కురులు
ముడిచి, కుంకుమతిలకము మోమున నిడి
నంతనే యింతసొగ పెట్టుల బ్బెఁ, జెప్ప
వే చెలి, వినంగ నామది వేడ్క పుట్ట.
తీరిగెదీపముదీ ప్తి నల్దెసలఁ బర్వీ .
చదలఁ బీఁకటి నిటునటు కదలఁబార
జేయు చుండ నొయారమ్ము నెలఁగనిలచి
మాటలాడెడు నీసౌరు మనముఁగొనియెఁ
జెలియరో, దేవలోకంపుఁ జేడెలవగు
లోపమే లేని యుత్తమరూపములనుఁ
గంటిఁగాని యదేమొ నాకన్ను లకుసు
నీదుమూర్తియె మోదమ్ము నించె నిజము.
ఉత్తమాకృతి జీవసంప త్తిఁ గలుగు
సహజలావణ్యమున కెట్లు సాటివచ్చు?

కావున దండి, విశ్వనాథ, జగన్నాథపండితు లాదిగాగల పక్షమువారికి కావ్యమున రసముపట్లఁ బక్షపాత మెక్కువ,