పుట:2015.372978.Andhra-Kavithva.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


నుపలక్షింపఁగలిగిరి. కవిశబ్దకార్మికుఁడనియు, కావ్యము అదోష శబ్దార్దమయమనియు మొదటివారు నిర్ణయించిరి. అనఁగా మమ్ము టాదులు కవితను కళగా నన్వయించిరి. వామనాదులు కొంచె మించుమించు శాస్త్రముగాఁ బరిగణించిరి. ఒకటి శాస్త్రీయ పథము; మఱియొకటి రామణీయకపథము. మొదటి తెగవారికి శాస్త్రములయెడ నభిమాన మధికము; ప్రమాణబుద్ది విశేషము. రెండవ తెగవారికి రసపక్షపాతము లెస్స;స్వాతంత్ర్యరక్తి యమితము, ఒకరు నియమములను బెంచి ఆదర్శమునకు వైరళ్య మాపాదించిరి. 'వేరొకరు నియమములు అవిలంఘనీయములు కావని ఆచర్శమున కౌన్నత్యము నొప్పికొనిరి

కావ్యము సృష్టియేనా?

మున్ముందుగ సాహిత్యవిషయకవివాదములలో నెల్ల ముఖ్యమగు కావ్యసృష్టినిగూర్చిన భిన్న భిన్న మతములను బరి శీలింతముగాక! పదపడి బాహ్యచిహ్న ములగు, శయ్యారీతులను, బ్రయోగసిద్దిని, శబ్దశుద్దిని, నలం శానములనుగూర్చి సవిమర్శ ముగఁ జర్చింతము. ఆట్లనుటలో విషయమునకును, దత్ప్రకటన మునకును భేదమున్నదని నేను జెప్పుచున్నట్లు తలంపఁదగదు. వాదసౌకర్యము యిట్టివిభాగమును జేయనలసివచ్చింది,

కవిబ్రహ.

కవి మన దేశమునఁ గని బ్రహ, 'కావ్యనిర్మాత, కొవ్య కారుఁడు నను పలునామములతోఁ బిలువఁబడుచున్నాఁడు. ఇట్టి నామకరణ మర్థవంతమయినదో కాదో యరయుదము, కవి సృష్టి కర్తయని పలుకు వారు కొందఱు గలరు. వారిమతమునఁ బర మేశ్వరుఁడు 'ప్రపంచమ నెట్లు నిర్మించెనో కవియు నట్లే, కావ్య