పుట:2015.372978.Andhra-Kavithva.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ఠ

కావున వానికి' మనము ప్రాధాన్యము నొసఁగఁదగదనియు, నందుచే నలం కారము లనావశ్యకములన్న చో శబ్దాలంకార ముల సంగతి చల్లఁగా దాఁట వేసి మఱుఁగు పఱచవచ్చుననియు, సహజములును, నప్రయత్నముగ వచ్చునవియు నగు నర్గా లంకారములకు మాత్రము తావుండియే తీఱుననియు, అందుచే నలంకారము లనావశ్యకములని, 'చెప్పుట సులువైన మతమని వీరు భ్రమించు చున్నారు. దీనికిఁ దార్కాణముగ శ్రీ రాయ ప్రోలు సుబ్బారావు గారు మమ్మట పండితరాయ లిరువుర యొక్క కావ్యవి భజనము నాధారముగఁ గొని, ధ్వని ప్రధాన కావ్యము లుత్తమోత్తమము లనియు, ధ్వనికన్న వాచ్యమగు నర్థమే ప్రధానముగఁ గల కావ్యములు ద్వితీయములనియు, నర్థ చమత్కృతి ప్రధానముగఁగల కావ్యము లధమములనియు, శబ్దచమత్కృతి ప్రధానముగఁ గల కావ్యములు కావ్యములు కానే కావనియు. నట్టి వరమాదమములనియు బండితరాయలు. శాసించెను. మమ్మటాచార్యులు ఆర్థచమత్కృతి ప్రధాన ముగాఁ గల కావ్యములను శబ్దచమత్కృతి ప్రధానముగాఁ గల కావ్యములను నేక గౌరవారములుగ భావించి రెంటిని నధమములని నిరసించెను.

అలంకారము లనావశ్యకములు. శబ్దార్థాలంకారములు సమాన గౌరవార్హములే.

మామతము మమ్మటాచార్యుని మతమే. ఏలననఁగా:-- అలంకారము లనునవి యనావశ్యకములు గనుకను, సహజ. సుందరమగు నాకృతు లలం శారములు లేక నే భాసిల్లును గను కను, కావ్య విషయమునఁ గూడ నలం కారము లనావశ్యకము