పుట:2015.372978.Andhra-Kavithva.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావప్రకటనము.

259


ననఁగా కథలోని స్త్రీ పురుషులు మాటాడునప్పుడు పాత్రోచిత ములైన కొన్నింటమాత్ర ముపయోగింపఁ దగుననియు, కాని భావములు మహోజ్వలములుగ రేఁగునపుడు ప్రకృతమునం దే యవధాన ముంచుట మంచిదనియు, నట్టితరుణముల సలంకార ములు సాధారణముగ నసంబద్ధ ప్రలాపము లే యనియు, శబ్దా లంకారము లంతగా ముఖ్యములు కావనియు శ్రీ రెడ్డి గారి మతము, కుయుక్తుల చేతను, దీర్ఘాలోచనము చేతను, శేషాదుల సాయము చేతను బలవంతముగ నీడ్చి తెచ్చిన యలంకారములను విసర్జించిన 'నేంతయో బాగనియు, నట్టి విపరీతాలంకారరచనకుఁ బ్రేరేపకము భావశూన్యతయే యనియు, హృదయము భావ పూరితమై యున్నప్పుడు సాదృశ్యములపై కి దృష్టి చనదనియు శ్రీ రెడ్డి గారు సోదాహరణముగ నిరూపించిరి.

వీరి సిద్ధాంతమును బూర్వపక్షము సేయుటకై మన్మిత్రులగు శ్రీ కురుగంటి సీతారామయ్య గారు “అలం కార తత్త్వవిచారము” అను గ్రంథమున నలంకౌరము లావశ్యకములని సిద్దాం తముఁ జేయఁజూచిరి. ఆగ్రంథమును విమర్శించుచు శ్రీ రాయ ప్రోలు సుబ్బారావుగారు శ్రీ సీతారామయ్యగారి వాదము నాక్షేపించి శ్రీ రామలింగా రెడ్డి మతమునే సమర్థించిరి

శబ్దార్థాలంకారముల తారతమ్యము. పూర్వలాక్షణికమతము.

కాని, యిచ్చట నొక చిన్న తమాషా యున్నది. అది యేమనఁగా - అలంకారము లావశ్యకము లనినచో , శబ్దా లంకారములను కూడ నొప్పికొనవలసివచ్చుచున్న దనియు, నట్టి శబ్దాలంకారములను మనలాక్షణికుల ప్రథానములని నిరసించిరి