పుట:2015.372978.Andhra-Kavithva.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

. భావప్రకటనము.

261


లనీయు, సహజ మాధుర్యమును సహజ సౌందర్యవర్ల నాపటిమ గల కావ్యముల నలం కారములకు నవసరములే యనియు సిద్ధాంత మగుచున్నది. కావ్యమునకు సహజ మాధుర్యమును, స్వభావన్సౌందర్యమును నాపాదించు శక్తియు లక్షణమును నెది? ఆను విషయమును తరువాత జర్చించెదను, ప్రస్తుత మనావళ్యకములగు నలంకారములలోఁ గొన్నిటి నంగీకరించి కొన్నింటి సంగీకరింపకపోవుటకుఁ దగిన కారణము లేవియో నిరూపించి నాకుఁ దోఁచిన యభిప్రాయము నొసంగెదను. *పండ్లూడఁగొట్టుకొనుట కేరాయియైన నేమి' అన్నట్లు స్వార స్యముఁ జెడఁగొట్టుట కర్థాలంకార మైన నేమి, శబ్దాలంకార మైన నేమి? ఒకటి మేనత్తమామల బిడ్డయై వేదొకటి కా లేదా? రసమున కాభాసము గల్గునట్లు వర్ణింపఁబడిన రెండును రోఁత జనింపఁ జేయును. ఇఁక రసమును బెంపొందించుటకు మితముగ వాడినయెడల రెండును బనికివచ్చును.

శబ్దాలంకారములకుఁ గొన్ని యుదాహరణములు. -


చూడుఁడు. పోతనామాత్యుని భాగవతము బహుళ సంఖ్యాకములగు శబ్దాలంకారములచే నిండియుండినను నంత నింపు నింపుచున్న దేల? భాగవతమున విష్ణు స్తోత్రముఁ జేయుచోట్ల పొరవశ్యమున పోతన యెన్ని శబ్దాలం కారముల వాడ లేదు? ఆపద్యములు మనకు నిరంతరము సంతోషమును, ఆనందమును గూర్చుట లేదా? నిసర్గముగ నర్థాలంకారము చేసికొన్న మహా పుణ్యమును లేదు, శబ్దాలంకారము గావించిన మహా పాపమును లేదు. రెండును పాపపుణ్యముల విషయమున సమానము లే. శబ్దాలంకారములు రసమును పోషించిన వనుటకు భక్తగీతము