పుట:2015.372978.Andhra-Kavithva.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు- భావనాశక్తి

229


కావలి: --మీరు తప్పక భయభ్రాంతు లయ్యెడివారే! రాకుమా;- నిజము. నిజము, ఆయాకృతి చాలనే పుండెనా?" ఇచ్చట కావలివాండ్రు, రాజుయొక్క భూతాకృతిని గాంచి భయపడియున్న వా రగుట చే రాకుమారుఁ డాభూత మును తాను గాంచియుండవలసినదని చెప్పినప్పుడు తమవలెనే యతఁడును భయపడియుండునని తలఁచి యాభావమును “ మీరు తప్పక భయభ్రాంతు లయ్యెడివారే” యనిరి, తోడవే పొమాన్యకవి యెవ్వఁడై నను హామ్లెటు రాకుమారునిచే “ఏమి, నేనా, భయ భ్రాంతుఁడ నగుదునా? లోకములు తల్లక్రిందులు గావే? నేనే భయపడినచో! నేనెన్న టికిని భయపడియుండను. మీరు పిఱికి వారగుటచే నేనును మీవలెనే భయపడియుందు నని తలంచితిరి గాని నేను భయపడుదునే? ఎంతమాటాడి తిరి?” ఇత్యాద్యా క్షేపణాపహాసపూర్వకమగు దీర్ఘ ప్రసంగముఁ జేయిం చెడివారే. కాని , హామ్లెటు రాకుమారుని యంతరాత్మ యందుఁ బరకాయప్రవేశవిద్య చేఁ బ్రవేశించిన షేక్స్పియరు మహాకవికి హామ్లెటుమనసులో నున్న భావము విస్పష్టముగఁ గన్పడెను, హామ్లెటు రాకుమారుఁడే షేక్స్పియరుచే తనమనో భావము నెఱుకఁ గావించెను. హామ్లెటున కప్పుడు వారితో వాదాడ పమయము కాదాయెను. ఆతఁడు వారివలన ననుమానాస్పదమగు పితృమరణవృత్తాంతమును వినఁగోరి తన్ను చింతాంబుధి విడిచి స్వర్గమున కేఁగిన తం,డి, యాకృతిని గని యాతఁడు చెప్పదలఁచిన పలుకుల వినుట కుత్సాహముకలు వాఁడై యుండెను. అట్టి హామ్లెటు వృత్తాంతము యావత్తును వినకపూర్వమే వారితో శుష్క వాదము గావించుచు కాలము