పుట:2015.372978.Andhra-Kavithva.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచము


నది. హామ్లెట్ అను రాచకుమారుని తండ్రి మరణించెను. అతఁడు మరణించిన విధ మనుమానాస్పదముగ నుండెను. రాకుమారునకు మాత్రము తన తండ్రి మరణము మిక్కిలి మనో వేదనను గలిగించెను. తన పినతండ్రి వెంటనే రాజ్యము స్వాధీనముఁ జేసికొని సింహాసన మధిష్టించి యన్న భార్యను సతి గాఁగూడఁ గైకొనెను. ఈసంగతులనన్నియు విని హామ్లెటు రాకుమారుఁ డత్యంత విషాదసంక్షుభితమనస్కుండయ్యెను. ఇట రాకుమారుని సుంగతి యిట్లుండఁగాఁ గోటగుమ్మము కడఁ గావలి యుండు పహరా జహనులకు వరుసగా మూడు రాత్రులు ప్రతి రాత్రయందున్నను రెండు జాముల వేళకు చనిపోయిన హామ్లెటు రాజు నిజాకృతితోఁ గంపడెనంట. కన్పడిన తోడనే యాకావలివాండ్రు భయభ్రాంతు లైరఁట. వారలలో ధైర్య వంతుఁ డొకం ఎట్ట కేలకు నాఁటి రాత్రి, యారాజు యొక్క యాకృతినిగని దాని కేమైన కోరిక లుండెనో కసుఁగొనవలె నని పలుకరింపఁబోవఁగా నయ్యది ప్రత్యుత్తర మీయకుండ నేఁగెను. అంత నాకావలి వాండు మఱునాడు హామ్లెటు రాకుమారునికడ కేఁగి యతనితో జరిగిన సంగతియెల్లఁ దెలిపిరి. తెలుఫునవసరమున వారి కీ క్రింది సంభాషణము జరిగెను:--

“కావలి: - అయ్యా, మూఁడు రాత్రులనుండియు మాకుఁ గనిపించుచునే యున్నది. రాకుమారుఁడు:— ఆభూతముయొక్క యాకృతి యెట్లుండెను? కావలి.. అచ్చముగ హామ్లెటు రాజుగారి యాకృతియే మహాప్రభూ! రాకుమా:- ఆట్లైన నేను దానిఁ జూచియుండవలసినది..