పుట:2015.372978.Andhra-Kavithva.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచము


వృథాపుచ్చుచు తనమనస్సునందలి తృష్ణ నాఁపికొనకుండ.యూరకొనునా? అందుకనియే హామ్లెటు వారితో వాద ముపసంహరించుటకై కావలిపోండ్రిమాటనే యొప్పికొని తరువాత ప్రశ్నము వైచెను. “నిజము, నిజము.” అని కావలి. వాండ్రమాటల హామ్లెటు బదులు చెప్పుటయే యిందులకుఁదార్కాణము. కావలివాండ్రతో వాదుసల్పకుండుటకై వారి మాటలనే యొప్పికొని తలయూఁచి హామ్లెటు తరువాతి ప్రశ్నము నడిగెను. “ఆహా! ఎట్టి దివ్యదృష్టి ? ఎట్టి సందర్భశుద్ధి! ఎట్టి యాచిత్య గ్రహణము? రవి గాననిచోఁ గవికానకుండును. యను నార్యో యిట్టి సందర్భమున నుపయోగింపఁ జెల్ల దే, సామాన్యకవుల 'కెల్లరకు గోచరింపని హామ్లెటు రాజకుమార హృదయాంతర్గతభావము భావనాశక్తియుతుండగు షేక్స్పియరు మహాకవి కర్ణమునఁ జూచిన దానియట్లు 'సొంత విస్ఫుటముగను,. నెంత సత్యముగను, నెంత శుద్ధముగను, నెంత 'యనన్యపర తంత్రముగను గన్పిం చెసు? ఎట్టి పరకాయ ప్రవేశ ప్రభావము: ప్రపంచమందలి నాటకకర్తలలో నిట్టి సర్వస్వతంత్ర భావనాళక్తి గలవా రరుదుగ నుందురు, షేక్స్పియరైనను నిట్టియద్భుతళ , కొలఁదిసందర్భములలో నే యుపయోగింపఁగలిగెను, 'ఇంకం గొన్ని యుదాహరణముల నొసఁగకమానఁజూలను.

9. షేక్స్పియరుకృతమగు నొతెల్లోనాటకము.-

ఒతెల్లో యను మూరు దేశపు వీరుఁ డొకఁడు డెస్టిమోనా యను గ్రీకుకన్యను, జమీఁందారుని కొమరితను గాంధర్వ వివాహమునఁ గొని యామెతో సమితసౌఖ్య మనుభవించు చుండఁగా అయాగో యను దుష్టుఁడొకఁడు చూచి యోర్వ