పుట:2015.372978.Andhra-Kavithva.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచము


ఊహాశక్తి గల కవులకు మితభాషిత్వము సున్న,

ఊహాశక్తిగల కవు లట్లుగాక విషయమునందుఁ బ్రత్యేకముగ నభిమానము లేనివారగుట చే శాస్త్ర కారుని రీతిఁ బ్రపంచ ముననున్న సంగతులనన్ని యువర్ణనీయ విషయములతో సరిపోల్చి చూచి యయ్యది సర్వలక్షణ సమేతమనియు, సంపూర్ణ సౌందర్య విలసిత మనియు, వర్ణింతురు. ఇట్టివర్ణన స్వభావవిరుద్దమనియు, రసాభాస కారణమనియు వేఱుగఁ జెప్పనక్కర లేదు. కవి విషయమునందు అభిమానము గలవాఁడైనచో విషయమున కను కూలించు గుణములనే వర్ణించి సంతసముఁ బొందును. చూడుఁడు...మన కడుపులఁగన్న బిడ్డలు మన కంత ప్రేమా స్పదులుగ నుండుటకుం గారణము వారు తోడివారలకన్న నంద ముగ నుండిరనియా? లేక మన కడుపునఁ బుట్టి వారి వన్నె చిన్నెలచే మన మనస్సుల కైవసముఁ గొనుచుందురనియా!' కారణము తప్పక స్పురించును. మనకును వారికిని గల రక్త సంబంధము కతన వారికై మనకుఁ గల యను రాగము కతన వారి యొక్క పన్నె చిన్నెలు తమంతటఁ దామే మిగిలిన విషయములతొఁ బ్రసక్తియు నవసరమును లేకుండఁగ నే యానందము నొసంగుచుండును. అందువలన మనము వారి నెడఁభాసియుండు సపుడు వారియొక్క ప్రత్యేకములగు ఎన్నె చిన్నె లే మనమనస్సుల నిరంతరముఁ గలఁత పెట్టుచు వారిని జ్ఞప్తికిఁ దెచ్చుచుండును. కావ్యవిషయమునను నిట్లే

తిక్కనమిత భాషిత్వమున కుదాహరణములు

.

చూడుఁడు. కవి మితభాషి, యనుటకుఁ జక్కని యుదాహరణము, అభిమన్యుని మరణమున కై పరితపించుచు 'శోకించు.. నర్జునుని విలాపమును దిక్కన యెట్లు వర్ణించెనో -