పుట:2015.372978.Andhra-Kavithva.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భాపనాశక్తి,

213

పరిస్ఫుటములుగ గోచరించును. చూడుఁడు. కొందఱు స్త్రీలకు మొగమే యందముగ నుండును. కొందఱకుఁ జక్కని కన్ను లుండును. కొందఱకుఁ జక్కని ముక్కు లుండును. కొందఱ రేచక్కఁదనమును లేకున్నను మనస్సు సౌకర్షింపఁగల టీవియు 'హొయలును వాలకమును మందహాసమును నుండును. భావనా శక్తి గలిగి రసికుఁడగు కవి యాయా వ్యక్తికిఁ బ్రత్యేక విలక్షణము లనందగు నవయవసౌందర్యవి శేషములనే వర్ణించునుగాని 'యూరక ప్రపంచముననున్న సౌందర్య లక్షణము లన్నీయు, పర్ణింపఁబూనఁడు. అట్లు వర్ణింపఁబూనిన హాస్యాస్పదుఁ డగును. 'సీతమ్మకు ముక్కు సొగసు, రుక్మిణమ్మకుఁ గన్నులు సొగసు, కావున నీయమ్మ ముక్కును నాయమ్మకన్నులును దీసి బ్రహ్మ దేవుఁడు వేరొక పెద్దమ్మను సృజించెను. కావున నీమూఁడవ యమ్మ సీతా రుక్మిణులకన్న రెండింతలు సొగసుకత్తియ యని వ్రాయువారికి శిల్పముయొక్క తెఱంగను వాసన యేమాత్ర, మైనఁ దెలియుసని వచింపనోనా?' అని శ్రీ రెడ్డి గారు ప్రశ్నించుటలో నట్టివర్లనము యొక్క వెకిలితనము పూర్తిగా వెల్లడియగు చునేయున్నది. అందుచే భావమునకును, అనఁగా నాభావము నకు నాశ్రయమగు పాత్రమునకును, బ్రత్యేక ప్రాణమును బ్రత్యేక సౌందర్యమును, బ్రత్యేక గౌరవమును, బ్రత్యేక విలక్షణతను నొసఁగఁగల సౌందర్య విశేషములే వర్ణనీయములు గాని, యన్యములు గావు. అందుచే భావనాశక్తిగల కవి మిత భాషీయని మేము మున్ను వచించియుంట.