పుట:2015.372978.Andhra-Kavithva.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచమ.


బ్రయత్నించును. శాస్త్రకారునికి విషయముపై భావసంబంధ మగు నభిమానముండదు. అతనికున్న యభిమాన మెల్ల విషయమును గ్రహింపఁగోరుటయే. భావకున కట్లుగాదు. భావన చేయు విషయముపై నతనికి సభిమానము మెండు. అందుచే నతఁడు. దన యభిమానమును అనుసరించి తన కవసరమయిన విషయ మునే, తన మదికింపగు సంగతులనే, తన చిత్తవృత్తికి ననుగుణములగు విశేషములనే యరయుంగాని సంపూర్ణ పొండిత్వ ప్రకరకై పెనంగులాడఁడు. భావనాబలమునఁ గవికి భావమున కనుకూలములును, బ్రథాసములును నగు గుణములు మాత్రమే గోచరించును. అట్టివానినే యాతఁడు వర్ణించును. అంతియే కాని యూరక శుష్క ప్రలాపముఁ గావింపఁడు. ఈవిషయ మును గొంచెము విమర్శించి నిజమగు భావనాశ కికిని భావనా శక్తియని మనవారు.. అందును ముఖ్యముగఁ బండితులు తప్పఁ దలంచు నూహాశక్తికిని భేదము నరయుదము,

భావనాశక్తికిని సూహాశక్తికిని గల భేదము మితభాషిత్వము.

భావనాశక్తిగల కవి సహజముగ మితభాషి. తాను వర్ణించు విషయమును దనయొక్క చిత్తవృత్తికిఁ దన్నావేశించుకొని, యుండు భావనకు ననుగుణమగు రీతిని వర్ణించును. అంతియే కాని, సంపూర్ణ సౌందర్యము కొఱకుఁగాని, సంపూర్ణ ప్రతిభా ప్రకరము కొఱుకుఁగాని ప్రయత్నింపఁడు. ఈవిషయమునఁ గావ్యవర్ణనాపద్ధతులలో భావనాశక్తిగల కవులకును నూహా శక్తిగల కవులకును భేదము విచారింపఁ దగును. భావనాశక్తి గల కవులకు విషయమున నేవోకొన్ని లక్షణములు మాత్ర మే