పుట:2015.372978.Andhra-Kavithva.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భావనాశక్తి.

215


క. “అన్నగుమోమును న త్తెలి
గన్నులు నవ్వెడఁదయురముఁ గన్నారంగా
గన్నను బ్రదుకుదుఁ గానక
యున్న ను బ్రాణంబు లెట్టు లుండగనేర్చు ౯

భాపనాశక్తియుతుఁడగు తిక్కనకవి బ్రహకును శోకసంభిత మనస్కుఁడగు నర్జునునకును నభిమన్యుని యాకృతీ సర్వమును జ్ఞాపకమునకు రాక యతని నగుమోమును దెలిఁ గన్ను'లును, వెడఁదయురమును మాత్రమే జ్ఞప్తికివచ్చుచున్నవి. ఈవర్లన మెంతయు సహజమనుటకు సందియ మున్న దే? తండ్రికిఁ జూచుతోడనే ముద్దుఁగొలుపు నవ్వుమోమును, హృదయభావనైర్మల్యమును సూచించు దెలిఁగన్నులును, శూర సహజమగు వెడఁదయురమును మాత్రమే యర్జునుఁడు మనస్సునకుఁ దెచ్చికొనినాఁడు. అర్జునునిచే నట్టిపలుకులఁ బలికించిన తిక్కన భావనాశ క్తియు, నౌచిత్య గ్రహణశక్తియు నెంతపొగడకుం దగినవి !

ఈపద్య మూహాశక్తిచేఁ గల్పింపఁబడిన దనుటకు సందియము లేదు. ఆలోచించి, ఆలోచించి, అభిమన్యుని సౌందర్య మెట్లుండెనాయని వితర్కించి వితర్కించి పిముటఁ జెప్పినయ ట్లున్నది గాని శోకరస మొక్కుమ్మడి పెల్లువెల్లువఁగ నుదయింప దత్త రంగములచే సంక్షోభితమగు మనస్సుగల యర్జునుఁడు చెప్పినయట్లు లేదుకదా! అప్రధానములును, ఆలోచనాబలము ననే మనసునకుఁ దట్టు విషయములను మాత్రమే వీరు వర్ణించిరి. దీనికిఁ గారణము వీరికి తద్భావసాక్షాత్కారము లేమియే, అభిమన్యుని శౌర్యరసోపేతమగు మూర్తిని గన్నులఁ గాంచకుంటయే,