పుట:2015.372978.Andhra-Kavithva.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచము


మయినవా? లేక మనసంబంధ మయినవా? ఈ ప్రశ్నమునకు సమాథానముఁ జెప్పవలయు నన, దీర్ఘమగు మనశ్శాస్త్ర సంబంధమయిన చర్చకుఁ గడంగవలసియుండును. ఆయ్యది యప్రస్తుతమును విశేష ప్రయోజనరహితమును నగుటచే సంగ్రహముగ సూచించి మన విషయమున కనుకూలించు 'నంతవఱకుఁ దెల్పెదను. ,వస్తువును గాంచినతోడనే జనించు 'సుఖదుఃఖములు మానసికములేయని మామతము. శరీరసంబం ధములైన సుఖదుఃఖములు బాధయు, హాయియు మాత్రమే యగును. అట్టి బాధయు హాయియు నింద్రియవ్యాపొర ములకు సంబంధించిన వగుట చే శారీరకసుఖదుఃఖము లనఁ జెల్లును. భావమువలన ముఖ్యముగ మనస్సున కే సంక్షోభము గలుగును. మనస్సంక్షోభము శారణముగ శరీరముగూడి శుష్కించిన శుష్కించుంగాక! అట్లగుటయు సహజమే. శాస్త్ర సమతమును గూడ, ఎట్లన, మనశాస్త్రము యొక్క ప్రధాన సిద్ధాంతము ననుసరించి శరీరమునకు బాధ గలిగినచో మన స్సునకును భాధ గలుగును. మనస్సునకు బాధ గలిగినచో శరీరమునకును బాధ గలిగియే తీరును, మనస్సును శరీకమును ఏక ప్రాణయుతములే. భిన్న వ్యక్తులు గావు. అందుచే నొక దానికి బాధ గలిగిన రెండవదానికిఁగూడ బాధ గలిగియేతీరును. అట్లగుటం జేసి మనస్సంబంధమగు వికారము లన్నియు శారీర సంబంధములగు వికారములుగఁ బరిణమించునని సిద్ధాంతము, మతి భ్రమము నొందిన పిచ్చివాడు వికారములగు చేష్టలు గావించుట మనము నిత్యముఁ జూచువిషయమే. 'మతి తిన్న గా నుండువారు అట్టి వికార చేష్టలకు లోనుగారు,కావుననే