పుట:2015.372978.Andhra-Kavithva.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావములు భావనాశక్తి,

199



సనగల పుష్పము ఇతరవస్తువులకు సైతము తన వాసన నొసగు రీతియే భావమునకు వర్తించును." '

పై నిర్వచనముయొక్క తాత్పర్య మిట్లు చెప్పనగును. కన్ను లకు గోచరించు వస్తువుల దర్శనమువలన మానవునకు సంతోషముగాని, దుఃఖముగాని జనించును. అట్లు జనించిన సుఖముగాని, దుఃఖముగాని హృదయము నా వేశించినచో నాయవస్థ భావ మగును. అట్టి భావావేశమువలన మిగిలిన ప్రపంచమంతయు భావానుగుణమగు రూపమును దాల్చునెడ నయ్యది భావన యగును. అట్టి భావనయొక్క విజృంభణమే భావనాశక్తి యగును. కావున భావము శారీరికవిశారము మాత్రమేగాక మానసికవిగారముఁగూడనని యీనిర్వచనము తెలుపుచున్నది. అనఁగా, భావము శరీరమును మాత్రమేగాక మనస్సును గూడ వళముఁ జేసికొని వికారమునకుఁ బాల్సేయును,

భావములయొక్క స్వభావమును జన్మ ప్ర కారు. మును గూర్చిన భిన్న సిద్ధాంతములు.

“భావము లేప, కారము జనించును? వాని స్వభావ మేమి " యను ప్రశ్నకు సమాధానము నరయుదము. భావము యొక్క జనమునకుఁ గారణము మనోవికారమా? లేక శరీర సంబంధమగు విశాలమా? మన శాస్త్రజ్ఞులు, అనఁగ నలంకారి కులు భావము నునోవికారమును శారీరకవికారమును గూడ నగు ననిరి. కాని శరీరవికారము జనించి మానసికవికారముగఁ బరిణమించునా ! అను ప్రశ్నమునకు సమాధానము విస్పష్ట ముగఁ జెప్పరైరి. దృష్టి గోచరములగు వస్తువుల సందర్శనమున సుఖదుగిఖములు గల్గు ననుచున్నారే అవి యెట్టివి? శరీరసంబంధ