పుట:2015.372978.Andhra-Kavithva.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము

. భావములు భావనాశక్తి.

201


దృష్టిగోచరములగు వస్తువుల దర్శనమువలన జనించు సుఖ దుఃఖాదిభావములు శరీరమును గలఁత పెట్టుచుండునని నమ్మదగి యుండును. సంతోషము సగముబల మనియు మనోవ్యాధికి మందు లేదనియు జనులనుకొనుమాటలు ఈ రహస్యమును స్ఫుటముగ బోధించుచున్నవి. భావములు శారీరికవికారములుగ జన్మించి మానసికవికారములుగఁ బరిణమించునని యభినవ పాశ్చాత్యుల సిద్ధాంతము, ఈ సిద్ధాంతమును 'జేమ్సు లాంగ్ సిద్ధాంత' మందురు.

పాశ్చాత్య మతము, జేమ్సులాంగ్ సిద్ధాంతము.-

ఈ పేరఁ బరగు భావములనుగూర్చి వారొకవింతసిద్ధాంత మును గావించినారు. మనకు జనించు భావములు మానసిక వికారములగుటకుఁ బూర్వము శరీరసంబంధములగు వికారములుగ జన్మించి యాశరీర వికారము తగ్గిపోయిన పిదప మానసిక వికారము లై చిరస్థాయినొందఁగలవని వీరిమతము. ఉదా:-- సింహము మనుజుని పైకి దుముక వచ్చుచున్న దనుకోనుఁడు. మనుజుఁడు భయపడి పరువెత్తును. ఇచ్చట భావము భయము. మనస్సులో భయముఁ జెందుటవలన మనుజుఁడు పరువెత్తు చున్నాఁడా? లేక పరువెత్తీన పదప భయము ననుభవించు చున్నాఁడా ! జెమ్సులాంగ్ సిద్ధాంత ప్రకారము వస్తువును దర్శించినతోడనే శారీరిక వికారము జరిగియే తీరును. సింగ మును గాంచుటతోడనే మనుజుని మనోవ్యాపారము ఒక్క మాఱుగ స్తంభించిపోయి యతఁడు కారణము తెలియకనే పరువెత్తసాఁగును. అట్లు కొంతదూరము పఱువెత్తి యేల పరు వెత్తుచుంటినా యని వితర్కించుకొని కారణ మరసి తన్నుఁ