పుట:2015.372978.Andhra-Kavithva.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

అనంతో వై రస

197


మాటల యర్థమును మననముఁగావించిన సత్యము గోచరించును గదా? కావున రసమును, భావములును మానవుని చిత్తవృత్తుల ననుసరించియుండును. దుర్మార్గున కేవస్తువుఁ దిలకించినను దుష్టభావము లే తల లెత్తుచుండును. సన్మార్గవ ర్తనున కేవస్తువుఁ గాం చినను సద్భావము లే కలుగుచుండును. సరియే. మానవ ప్రకృతులును, చిత్తవృత్తులును ననంతవై విధ్యము కలిగియుండును గదా! అట్టిచో భావములును, రసమును ననంతవై విధ్యముకలిగి యుండక మానునా! ప్రపంచమున నెన్ని కోట్ల భిన్న ప్రకృతులు, మిశ్ర ప్రకృతులు, విపరీత ప్రకృతులు, అతీత ప్రకృతులు కలరో, అన్ని వింత భావములును, విపరీతరసములును, వర్తిలుచునే యుండును. రసములు తొమిదియే యని మనలాక్షణికులు తెల్పునది యంత శుద్ధసత్యము కాదు. సృష్టియు, మానవ ప్రకృతియు నెట్లనంతములో భావమును రసమును నట్టులే యనంతములు, ఈభావమునే రసవేత్తలు "ఆనంతో వై రసః” యని నిర్వ చించిరి.


#####-------