పుట:2015.372978.Andhra-Kavithva.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

ఆంధ్ర కవిత్వచరిత్రము

చతుర్థ


పించును. ఇంక శరీరసౌఖ్యముకల వానికి సర్వజగమును సంతోషం మయముగాను, సంతోషకరముగాను గన్పట్టును. సుఖముగఁ గడుపునిండ భుజించి హాయిగ హంసతూలికా తల్పమునఁ గూరుచుండి సరసపుష్పఫలసమన్వితమగు నుద్యానము వంకఁ జూచుచున్న వానికిఁ బ్రపంచ మానందమయముగను, సౌఖ్య, మయముగను గన్పట్టునుగదా? తలనొప్పిగ నున్న వానికి నెంత మధుర గాన మైనను తలనొప్పి నెక్కువఁ జేయును. అట్టిబాధ లేని నాని నెట్టిసొమాన్య గాన మైనను గరఁగింపఁజాలును.

-చిత్తవృత్తు లనంతములగుటచే రసములనంతములు.

చిత్తవృత్తులు శారీరక స్థితుల నాశ్రయించుకొనునటుల భావములును, రసమును జిత్తవృత్తుల నాశ్రయించుకొనును. ఎట్లనఁగా మనుష్యుని చిత్తవృతి యెట్లుండునో వానిభావములును నట్లేయుండును.ఉదాహరణము; వివాహకాలమున శుభమున నెల్లరును నోలలాడుచు నానందపరవళులై యుండు సమయమున వారి కెట్టి విచారభావములును నుండవుకదా! అంతి యకాదు, ఎన్ని చిక్కులైనను, ఎన్ని విచారములైనను నాసము యమున వారిమతుల కెక్క నే యెక్కవు. విచారమగ్ను లై యున్న వారికి, అనఁగా పుత్ర వియోగము చేతనో, దారవియోగము చేతనో కృశించువారికి నెట్టిశుభవార్తయైనను పెడ చెవిఁబడి నీరసమై పోవునుగదా? మనుచరిత్రమున గృహోన్ముఖుఁడై పలవరించు ప్రవరాఖ్యునికి దివ్యసుందరవిగ్రహయగు వరూధినిసౌందర్య మేమైన నచ్చెనా? నచ్చ లేదు? అతఁ డట్టి యెడ నుడివిన పలుకులలో నెంత సత్యమున్నదో కనుఁడు. “అనాళ్వాసిత దుఃఖితే మనసి సర్వ మసహ్యమన న్నెఱుంగవే?” యని పల్కిన