పుట:2015.372978.Andhra-Kavithva.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసము దేని నాశ్రయించికొనును !179



వాఁ డగుట చేతనే “రవి గాననిచోఁ గవి గాంచకుండు నే? " యసునార్యో క్తి కలిగినది. కవి సామాన్యమానవుల కగోచర ములగు రహస్యములను దనరసవృష్టి చేఁ గాంచి యనుభవించి, కవిత్వశ క్తి చేతఁ గాంచిన దానిని సుందరముగా రసముగఁ గవి త్వోచితరీతిని వర్ణించును. ప్రపంచమున నందరకును జీవితపరమావధియు జీవితపరమార్థమును నొక్క- టీయే, అది యే దనఁగఁ దన్నుఁదాను తెలిసికొని చేతనైనరీతిని తోడివారలకు సాయముఁ జేసి ముముక్షుత్వము నొందఁ గోరుటయే. ఈ విశాలవిశ్వమానవ మందిరమున భగవంతుఁడు ప్రతిమనుజున కొక్కొకగది యేర్పఱచినాఁడు. అట్టిగదులలోఁ గొన్ని పై యంతస్థులను, గొన్ని యడుగుభాగమునను నుండును. కొన్ని గదులకుఁ జక్కనిగాలియు వెలుతురును వచ్చును. కొన్ని టి కాసౌఖ్యసంపత్తి యుండనే యుండదు. కొన్ని రంగురంగుల గోడలతోను, అందమైనపటములతోను వచ్చుచుఁ బోవు వారలదృష్టి నాకర్షించుచుండును. కొన్ని చీకటి కోణములై మసి వారిన గోడలతోను, పొగతోను నసహ్యము లగును. చూడు మీభవనమున మన కవియుండు గది యేదో? అల్ల దే సౌధోపరిభాగమున నొక్కటేగది యున్న దే! ఆదియే. దానికి “జక్కనికిటికీ లున్నవి. వానినుండి నిరంతరము రకరకముల వెలుఁగులును, దేశ దేశముల, సీమసీమల గానామోదమును గొనివచ్చు వాయువులును నెల్లప్పుడును వచ్చుచునే యుండును. మనకవి యందుఁ గిటికిలోనుండి ప్రపంచమును దనివిదీజుఁ జూచి యానందించుచు, నాయానంద పారవళ్యమున నెడ తెగని పాటపాడుచు వచ్చిపోవు వారి నున్నతులం జేయుచుండును. ఎందరో తమతమపనుల నన్నియు మాని యాతనిపాట విను