పుట:2015.372978.Andhra-Kavithva.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ


ట్లున్నాఁడు. ఇట్టివాఁ డున్నఁ బ్రపంచమునకు హాని రాదా ? భూమియు సంఘమును దలక్రిందులుగావా! జీవితమందలి సామరస్యము చెడదా? ఇది యేమో చిక్కు సంగతిగా నున్నది. మా కే కవిత్వమును వద్దు. మా కేరసముతోడను బని లేదు. మా జీవితములు చల్లఁగా నే యొడిదుడుకులును లేక వెళ్లిపోయినఁ జాలును. ఎందుల కీ బెడందలు. కవిత్వము మానెత్తిమీఁది కేమి బెడఁదఁ దెచ్చి పెట్టునో, వలదు వలదనుచుఁ దత్తరమున సామాన్యమానవుఁ డడుగుచున్నాఁడు. రసికుఁ డభయహస్త మొసఁగి యిట్టులు చెప్పుచున్నాఁడు: –

"ఓయీ! యేమియు భయము లేదు. రజ్జుసర్ప భాంతి యని యిట్టిదానినే మన వేదాంతులు చెప్పుచుందురు. అది యేమన, త్రాడును జూచి పామనుకొని భయమందుటయే. అట్టి రజుసర్పభ్రాంతి చీకటిని నడ చెడు ప్రతిమనుజునకును, మహా మహులకును సైతము కలుగుచు నే యుండును. కానీ యది వట్టి భ్రాంతియే. దీపము వెలుఁగునఁ జూచిన వట్టి తాడే, ఎంత భయ పడితి మనుచు వారు తమలోఁదామే సిగ్గుపడుదురుకదా! అట్లే కవిత్వమాహాత్మ్యమును, రసప్రాశస్త్యమును దెలియనివాడ వగుట నీ కిట్టిశంక కలిగినది. దీపము వెలుఁగున, జ్ఞానముబల మున నిజమరసికొనుము. కవి నిజముగ విచ్చలవిడి దిరుఁగు ఫొఁడా? అతఁ డధరమునే బోధించునా? కాదు, కాదు, ముమ్మాటికిని కాదు. అందలిసత్యము నెఱుకపటి చెదను వినుము. కవిత్వదృష్టికిని అనఁగా రసదృష్టికిని శాస్త్ర దృష్టికిని భేదమున్నది, ప్రపంచముననున్న వస్తువుల నే కవి వేఱుకన్నులతోఁ జూచును. కన్నుఁగలవారుసై తముఁ గాంచ లేనిచోద్యము లెన్నో, రహస్యము లెన్నో కవికన్నుల కగుపడును. అట్టి తీక్ష దృక్కులుగల