పుట:2015.372978.Andhra-Kavithva.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ


చున్నా రే! చూడుము. ఎల్లరచూపు లతని పైననే యున్నవే! అతని మాటలనిన, నతనిపాటలనిన నంతవ్యా మోహ మేల కలుగవ లెను? ఆవినువారిలో నొకని నడుగుము. ఏమనుచున్నాఁడు?: 'పగ లెల్లను పని చేసి చేసీ యలసట చేఁ బోవుచున్న మాకు వీనుల విందుగా నీ ప్రపంచసౌందర్యమును, నీ జీవితానందమును, భగ వత్స్వరూపమును వర్ణించుచు మనోహరగానము సేయుచుండ వినుటకన్న నెక్కు డదృష్ట మున్నదా? గాలి, వెలుతురనునవి లేక యెల్లప్పుడును పొగచేతఁ గన్నులు పోవున టుండునా ? శాస్త్రులగదులలోఁ గన్నులు మూసికొనియే పని చేసి చేసి,కొంచె ముసేపయినను జల్లనిగాలిలో వెలుతురులో కన్ను లపండుగు, నీసమయమున వీనులవిందుగఁ బాడుచుఁ గన్ను లఁగట్టినట్లుగ, నానాలోచిత్రములను మాకవిసోదరుఁడు వర్ణించుచుండఁగా వినుటకన్న నెక్కువ యేమీ కావలెను ? అదియేమి? కవి. యేమనుచున్నాఁడు?

 శ్లో. కావ్యం కరోమి నహి చారుతరం కరోమి
యత్నాత్ కరోమి యది చారుతరం కరోమి:.
భూపాలమౌళిమణీరంజితపాదపీఠ
హేసాహసాంక, కవయామి, వయామి, యామి.

అతఁ డేదివర్ణించినను అందముగా, మనోహరముగా, ఆనంద జనకముగా నుండును. మనకు దేనియందుఁ బ్రీతికలదో దానినే యతఁ డెంతో సుందరముగా వర్ణించి మన ప్రీతిని వేయి.మడుంగు లెక్కువ కావించును. అతనివలననే మాజివితముల లోని సంసార బాధనంతయు, శ్రమమునంతయు, మఱచి యానంద మనుభవింపఁగలుగుచున్నాము, ఎవరున్నను,ఎవరు పోయి